Washi Yo Washi Telugu lyrics: మరో 5 రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాకోసం అభిమానులు, ప్రేక్షకులు సుమారుగా మూడేళ్ళ నుండి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసారు. ఈ సినిమా ప్రారంభమే ఒక సెన్సేషన్. సోషల్ మీడియా మొత్తం ఈ సినిమా ప్రకటన రోజున ఊగిపోయింది. కారణం పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ రోల్ చేయడమే. అందులోనూ సుజిత్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ఈ సినిమాకు తోడు అవ్వడంతో కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకం ఆరంభం లోనే అభిమానులకు కలిగింది. రెండేళ్ల క్రితం ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో సెన్సేషన్ అవ్వడంతో, ఈ సినిమాపై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలయ్యే ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ బాగా పేలింది.
అందుకే ఇండియా లో పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవ్వకముందే ఈ చిత్రానికి కేవలం ఓవర్సీస్ ద్వారా రెండున్నర మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాలా 20 కోట్ల గ్రాస్ అన్నమాట. కాసేపటి క్రితమే డిస్ట్రిక్ యాప్ లో హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు. బుకింగ్స్ మొదలు పెట్టిన కాసేపటికే ఈ చిత్రం హైదరాబాద్ నుండి రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడే ఇలా ఉంటే, రేపు థియేట్రికల్ ట్రైలర్ విడుదల అయ్యాక ఎలా ఉంటుందో అని ట్రేడ్ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అయితే ట్రైలర్ విడుదలకు ముందు అభిమానులకు ఒక స్వీట్ సర్ప్రైజ్ ని ఇస్తూ మేకర్స్ నిన్న ‘#WashiYoWashi’ అనే స్పెషల్ వీడియో ని విడుదల చేసారు. ఇందులో పవన్ కళ్యాణ్ జపాన్ భాషలో మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.
అయితే పవన్ కళ్యాణ్ అసలు ఏమి మాట్లాడాడో అర్థం కాక అభిమానులు గూగుల్ లో అనువాదం చేసుకొని చూస్తున్నారు. తెలుగు లో ఆయన మాట్లాడిన మాటలు వింటే డైరెక్టర్ సుజిత్ లో ఇంతటి శాడిజం ఉందా అని ఆశ్చర్యపోక తప్పదు. ఇంతకీ పవన్ కళ్యాణ్ విలన్ కి ఇచ్చిన వార్నింగ్ ఏమిటంటే ‘ఒక క్రూరమైన గ్రద్దని చంపాలంటే, ముందు దాని రెక్కలను నరికేయాలి. ఆ తర్వాత అది నెల మీదకు పడిపోయిన తర్వాత దాని కళ్ళు పీకేయాలి. ఎప్పుడైతే ఆ క్రూరమైన గ్రద్ద గుడ్డిది అవుతుందో, అప్పుడు దానికి ఎటు వెళ్లాలో అర్థం కాదు. అలాంటి సమయం లో దాని కాళ్ళు నరికేయాలి. అప్పుడు ఆ గ్రద్ద ఎటు కదలక అలా నరకం అనుభవిస్తున్న సమయం లో దాని గుండెని పీకేయాలి’. ఇదే #WashiYoWashi అర్థం. చదువుతునేనే ఎంతో వైల్డ్ గా అనిపిస్తుంది కదూ. చూసేందుకు ఎంతో క్యూట్ గా, హీరో లాగా అందంగా కనిపించే డైరెక్టర్ సుజిత్ లో ఈ రేంజ్ వయొలెంట్ యాంగిల్ ఉందని దీనిని చూసిన తర్వాతే తెలిసింది.
