OG pre-release event details: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఓజీ'(They Call Him OG) మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా, రేపు ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఉదయం పది గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడో పది రోజుల ముందే ట్రైలర్ రావాల్సింది కానీ, మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో పూర్తి స్థాయిలో బిజీ గా ఉండడం వల్ల కుదర్లేదు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాల కోసం కూడా ఫ్యాన్స్ చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. అది కూడా రేపే అని తెలుస్తుంది. రేపు సాయంత్రం LB స్టేడియంలో ఈ ఈవెంట్ ఘనంగా జరగబోతుంది. సాయంత్రం ఆరు గంటల నుండి మొదలు అవ్వబోయే ఈ ఈవెంట్ కి మూవీ టీం తో పాటు కొంత మంది ప్రముఖులు ముఖ్య అతిథులుగా రాబోతున్నారు.
తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి తో పాటు పలువురు ముఖ్య నేతలు ఈ ఈవెంట్ కి రాబోతున్నారట. మెగాస్టార్ చిరంజీవి ని చీఫ్ గెస్ట్ గా పిలవాలని అనుకున్నారు కానీ, ఆయన షూటింగ్ కార్యక్రమాల కోసం విదేశాల్లో ఉండడం వల్ల ఈ ఈవెంట్ కి హాజరు కాలేకపోయాడు. అన్నదమ్ములను ఒకే వేదిక మీద చూసి తరిద్దాం అనుకున్న ఫ్యాన్స్ కి ఈ ఒక్క విషయం లో మాత్రం చిన్న పాటి నిరాశ ఎదురైంది. అయితే LB స్టేడియం లో ఈవెంట్ ని ఏర్పాటు చేయడంతో అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. ఎందుకంటే గతం లో ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని శిల్ప కళా వేదిక లో నిర్వహించారు. ఫ్యాన్స్ అందుకు నిరాశకు గురయ్యారు. కానీ ఇప్పుడు పెద్ద ఓపెన్ ఆడిటోరియం లో నిర్వహిస్తుండడం తో వేల సంఖ్యలో అభిమానులు ఈవెంట్ కి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం అందుకు సరిపడా పోలీస్ సెక్యూరిటీ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. చూడాలి మరి ఈ ఈవెంట్ ఈ సినిమా పై ఇంకా ఎంతటి అంచనాలు పెంచుతుంది అనేది. రేపు విడుదల అవ్వబోయే థియేట్రికల్ ట్రైలర్ అద్భుతంగా ఉంటే మాత్రం ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఎవ్వరూ ఊహించనంత పెరుగుతుంది. ఇప్పటికే 2.4 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు ఓవర్సీస్ నుండి వచ్చాయి. ట్రైలర్ తర్వాత కచ్చితంగా మరో రెండు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. విడుదలకు ముందే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కచ్చితంగా వంద కోట్ల గ్రాస్ మార్కును దాటుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి అది ఎంత వరకు నిజం అవ్వబోతుందో చూడాలి.