Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో తన స్థాయిని విస్తరించుకుంటూ వస్తున్న నటుడు చిరంజీవి. ఈయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటు ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక సినిమా చేసేటప్పుడు అది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందా లేదా అని ఒకటికి పది సార్లు చెక్ చేసుకుంటాడు. అలాగే ఇందులో మనం కొత్తగా ఏం చెప్తున్నామనేది కూడా క్లారిటీగా తెలుసుకొని దానికి అనుగుణంగా తనని తాను మార్చుకోవడంలో ఎప్పుడు కృషి చేస్తూ ఉంటాడు. అందుకే 40 సంవత్సరాల నుంచి ఏకచత్రాధిపత్యంతో ఇండస్ట్రీని ఏలుతున్నాడు.
ఆయనను టచ్ చేసే హీరో ఇప్పటివరకు ఇంకా ఇండస్ట్రీలో పుట్టలేదనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి చిరంజీవి ని కొంత మంది హీరోలు వాళ్ల స్వార్ధ ప్రయోజనాల కోసం దూషిస్తూ ఉంటారు. అయితే మిగతా వాళ్ల పరిస్థితి ఎలా ఉన్నా కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదటినుంచి కూడా చిరంజీవి అంటే హీరో రాజశేఖర్ కి అసలు పడదు.
వీళ్లిద్దరి మధ్య ఎప్పుడు ఏదో కాంట్రవర్సీ నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా చిరంజీవి తాను కాముగా ఉన్నప్పటికీ రాజశేఖర్ మాత్రం ఏదో ఒక విషయంలో చిరంజీవిని తన పక్కలో వేసుకుంటు ఉంటాడు. అయితే ఠాగూర్ సినిమా విషయం లో వీళ్ళ మధ్య ఒక కాంట్రవర్సీ జరిగింది. ఆ సినిమా రైట్స్ ని రాజశేఖర్ కొనాలి అనుకున్నాడూ, కానీ ఆయన కంటే ముందే చిరంజీవి కోసం అల్లు అరవింద్ ఆ రైట్స్ ను తీసుకున్నాడు. అయితే ఆ సమయంలోనే చిరంజీవి కావాలనే తనని తొక్కేస్తున్నాడని తను చేయాల్సిన సినిమా రైట్స్ ను చిరంజీవి తీసుకున్నాడు అంటు రాజశేఖర్ నానా హంగామా చేశాడు. అయితే ప్రొడ్యూసర్ తన ఇష్ట ప్రకారంగానే అల్లు అరవింద్ కి రైట్స్ ని అప్పజెప్పినట్టుగా పూర్తి స్పష్టంగా తెలియజేసినప్పటికీ, రాజశేఖర్ మాత్రం చిరంజీవే తనని కావాలని ఇలా డామినేట్ చేస్తున్నాడు అంటూ కామెంట్లు చేశాడు. ఇక దానిమీద చిరంజీవి ఏ రకంగా స్పందించలేదు.
ఇక ఆ తర్వాత రాజశేఖర్ తన తప్పు తనే తెలుసుకొని చిరంజీవి వద్దకు వచ్చి సారీ చెప్పినట్టుగా అప్పట్లో చాలా కథనాలు కూడా వెలువడ్డాయి. ఇక రాజశేఖర్ తో పాటు చిరంజీవిని ఎప్పుడూ దూషిస్తూ ఉండే మరో హీరో మోహన్ బాబు. ఈయన కూడా చిరంజీవిని చాలా సందర్భాల్లో వ్యతిరేకించి ఆ తర్వాత సారీ చెప్పాడు. ఇలా ఇండస్ట్రీలో చిరంజీవిని ఎవరు దూషించినా కూడా చివరికి వాళ్ళంతట వాళ్లే మళ్లీ రియలైజ్ అయి తన దగ్గరికి వచ్చి క్షమించమని అడగడం సహజమైపోయింది…