Chiranjeevi: కొన్ని సినిమాలు చేస్తే కొంతమందికి మంచి పేరు వస్తుంది. అయితే కొంతమంది స్టార్ హీరోలతో చేస్తే ఆ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్లందరికీ మంచి పేరు అయితే వస్తుంది. ఇక ఇదే క్రమంలో చిరంజీవి లాంటి స్టార్ హీరోతో చేసిన ప్రతి టెక్నీషియన్ కి మంచి గుర్తింపు తో పాటు మంచి ఆఫర్లు కూడా వస్తాయి ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ చిరంజీవితో సినిమాలు చేసి లైఫ్ ని కోల్పోయిన డైరెక్టర్లు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
చిరంజీవి రీఎంట్రీ సినిమా అయిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో తను గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దాంతో చిరంజీవి రీఎంట్రీ సక్రమంగా సాగింది అని చాలా వార్తలైతే వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా తమిళం లో విజయ్ నటించిన కత్తి సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది.
అయితే ఈ సినిమాని సక్సెస్ చేయడానికి వినాయక్ తన పూర్తి ఎఫర్ట్ పెట్టి ఈ సినిమాని తీశాడు అయినప్పటికీ ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది ఇక ఇంతకుముందు వీళ్ళ కాంబోలో వచ్చిన ఠాగూర్ సినిమాని మైమరిపించేలా ఈ సినిమా ఒక సోషల్ మెసేజ్ తో రావడమే కాకుండా ప్రేక్ష ప్రేక్షకులందరికీ విశేషంగా అనిపించింది.ఇక ఈ క్రమంలో ఈ సినిమా దర్శకుడు అయిన వి వి వినాయక్ ఇంత మంచి సక్సెస్ అందించిన కూడా ఆయనకి తర్వాత పెద్ద సినిమాలు ఏమీ ఆఫర్ రాలేదు. దాంతో సాయిధరమ్ తేజ్ తో ఇంటెలిజెంట్ అనే సినిమా చేశాడు ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ సాధించలేదు ఇక ఇప్పుడు రీసెంట్ గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని పెట్టి బాలీవుడ్ లో ఛత్రపతి సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేశాడు.
అది కూడా డిజాస్టర్ అయింది.ఇక దాంతో వినాయక్ కి వరుసగా ఫెయిల్యూర్ సినిమాలు రావడంతో ఆయన మార్కెట్ అనేది పూర్తిగా డౌన్ అయింది ఇప్పుడు ఆయనతో పాటు సినిమా చేసే ప్రొడ్యూసర్ లేడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఒక చిరంజీవితో సైరా లాంటి సినిమా చేసి తన సినిమా కెరియర్ ని పోగొట్టుకున్న మరో దర్శకుడు సురేందర్ రెడ్డి ఈయన ఇంతకు ముందు స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందాడు. కానీ సైరా సినిమాతో ఫ్లాప్ ని మూట కట్టుకోగా ఆ తర్వాత వచ్చిన ఏజెంట్ సినిమాతో మరో డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు…