Trivikram And Chiranjeevi: త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ తెలుగులో మంచి సినిమాలు చేస్తు ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం పోటీ పడుతున్నారు.త్రివిక్రమ్ మాత్రం చాలా సెలెక్టెడ్ గా తనకు అనుకూలంగా ఉన్న హీరోలతో మాత్రమే సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటాడు. నెక్స్ట్ తను అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే చిరంజీవి త్రివిక్రమ్ సినిమా ఒకటి వస్తుంది అంటూ చాలా రోజుల నుంచి చాలా రూమర్లైతే వస్తున్నాయి. అయితే ఒకానొక సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య సినిమా ఉంటుంది అని అనౌన్స్ కూడా చేశారు కానీ అనుకోని పరిస్థితుల వలన ఆ సినిమా అనేది ఆగిపోయింది.
ఇక ఇప్పుడు ఆ సినిమా స్టార్ట్ అవ్వబోతుంది అంటూ తెరపైకి ఒక న్యూస్ అయితే వస్తుంది. అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేయల్సిన సినిమా తర్వాత చిరంజీవితో చేసే సినిమా స్టార్ట్ అవుతుందంటూ భారీ ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. నిజానికి చిరంజీవి త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా 2020 వ సంవత్సరం లోనే స్టార్ట్ అవ్వాల్సింది. కానీ త్రివిక్రమ్ చెప్పిన కథకు చిరంజీవి అంత సాటిస్ఫై అవ్వకపోవడంతో ఆ సినిమా అనేది అప్పుడు పక్కన పెట్టేసారు.
అందుకే ఇప్పుడు ఒక కొత్త కథతో త్రివిక్రమ్ చిరంజీవి తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే క్రమంలో త్రివిక్రమ్ కూడా ఇప్పటివరకు చిరంజీవితో ఎవరు చేయలేని ఒక డిఫరెంట్ జానర్ లో కథని రాసుకున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇప్పటికే చిరంజీవి వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వం భర అనే ఒక సోషియో ఫాంటసీ మూవీ ని చేస్తున్నాడు. అలాగే ఈ సినిమా కూడా ఒక ప్రయోగాత్మకంగా గా సాగుతుందంటూ ప్రచారం అయితే జరుగుతుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి స్వాతంత్ర్య సమరయోధుడిగా కనిపించబోతున్నాడు అనే టాక్ కూడా నడుస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి రెండు పాత్రలను పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒక పాత్ర స్వాతంత్ర్య సమరయోధుడు అయితే మరొక పాత్ర ఏంటి అనేది ఇప్పుడు సస్పెన్స్ గా సాగుతుంది.
ఇక ఈ సినిమా పైన క్లారిటీ రావాలి అంటే చిరంజీవి గాని త్రివిక్రమ్ గాని మరొకసారి ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇంతకుముందు సినిమాని అనౌన్స్ చేసిన సమయంలో సినిమా అనేది ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు అనౌన్స్ చేయకుండానే డైరెక్ట్ గా సినిమాకు సంబంధించిన పనులను చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది పట్టాలెక్కాలంటే మరొక సంవత్సరం పడుతుందనే చెప్పాలి…