https://oktelugu.com/

Junior NTR : రాజమౌళితో సహా ఎన్టీయార్ కి ఇండస్ట్రీ హిట్ ఇవ్వలేకపోయిన స్టార్ డైరెక్టర్స్ వీళ్లేనా..?

జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన దేవర సినిమాతో సక్సెస్ ని అందుకున్న ఆయన ఇప్పుడు ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు... ఇక ఏది ఏమైనా కూడా తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : October 26, 2024 / 09:46 PM IST

    Junior NTR

    Follow us on

    Junior NTR :  నందమూరి తారక రామారావు గారి మనవడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. కెరియర్ మొదట్లోనే ఆది, సింహాద్రి లాంటి భారీ మాస్ సినిమాలతో 20 సంవత్సరాలకే టాప్ హీరోగా ఎదిగిన ఆతన ఆ తర్వాత వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగాడు. నిజానికి ఆయన చాలామంది టాప్ డైరెక్టర్లతో పని చేశాడు. అయినప్పటికీ ఆయనకు ఇప్పటివరకు ఒక ఇండస్ట్రీ హిట్ కూడా దక్కలేదు. ఇక రాజమౌళి, వి వి వినాయక్, పూరి జగన్నాధ్, శ్రీను వైట్ల, త్రివిక్రమ్, సుకుమార్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్స్ తో పనిచేసినప్పటికి ఆయనకు ఇండస్ట్రీ హిట్ ఇవ్వడంలో ఈ దర్శకులందరూ ఫేలయ్యారు. నిజానికైతే జూనియర్ ఎన్టీఆర్ భారీగా డాన్సులు వేస్తూ సింగిల్ టేక్ లో ఎంత పెద్ద డైలాగ్ ను అయిన సరే హావభావాలతో పండించగలిగే కెపాసిటీ ఉన్న నటుడు అయినప్పటికీ ఆయన ఎందుకు ఇండస్ట్రీ హిట్ కొట్టలేకపోయారనే విషయం మీద చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి. ఇక కొరటాల శివ దర్శకత్వం వచ్చిన ‘దేవర ‘ సినిమా కూడా ఆశించిన మేరకు విజయం సాధించలేదు. దేవర సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికి ఎన్టీఆర్ రేంజ్ సక్సెస్ అయితే దక్కలేదనే చెప్పాలి.

    మరి ఈ సినిమాతో ఆయన సూపర్ సక్సెస్ ని అందుకుంటాడని ఆనందం లో ఉన్న ఎన్టీఆర్ అభిమానులకు కొంతవరకు నిరాశ ఎదురైందనే చెప్పాలి. ఇక ఆయన ఇప్పుడు వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ లో టాలెంటెడ్ నటుడు గా పేరు తెచ్చుకున్న హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు.

    అందులో భాగంగానే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమాతో కూడా భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రణాళికలను రూపొందించుకుంటున్నాడు. ఇక మొత్తానికైతే ఇండస్ట్రీ హిట్ కొట్టలేకపోయిన కూడా ఎప్పటికైనా సరే ఇండస్ట్రీ హిట్ కొట్టే సినిమా చేస్తాననే ఒక దృఢ సంకల్పం ముందుకు సాగడం విశేషం…

    ఇక ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ సినిమా తోనే భారీ రికార్డులను క్రియేట్ చేయాలని ఎన్టీఆర్ దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. ఎన్టీయార్ అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ రికార్డుని క్రియేట్ చేయగలిగితే మాత్రం ఆయన ఇండియాలో టాప్ హీరోగా ఎదుగుతాడని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…