NTR And Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR), రామ్ చరణ్ (Ram Charan) లాంటి నటులు సైతం వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక వీళ్లిద్దరూ పాన్ ఇండియాలో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలే కావడం విశేషం… అలాగే వీరిద్దరూ కలిసి చేసిన ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా వీళ్ళిద్దరికి పాన్ ఇండియా లెవెల్లో మంచి ఐడెంటిటిని తీసుకొచ్చి పెట్టింది. ఇక ఇదిలా ఉంటే ‘త్రిబుల్ ఆర్’ సినిమా ప్రమోషన్స్ టైమ్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరిని కీరవాణి ఒక ఇంటర్వ్యూ అయితే చేశాడు. ఇక ఇందులో భాగంగానే కీరవాణి మాట్లాడుతూ నేను చేసిన సాంగ్స్ లో మీకు నచ్చని సాంగ్స్ ఏంటి అని అడగగా అందులో ఎన్టీఆర్ స్పందిస్తూ భీమవరం బుల్లోడ పాలు కావాలా మురిపాలు కావాలా అనే సాంగ్ నాకు నచ్చలేదు. అందులో వచ్చే మ్యూజిక్ అయితే నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పాడు… ఇక అలాగే రామ్ చరణ్ ని అడిగితే ఆయన మీ అన్ని సాంగ్స్ బాగానే ఉంటాయి. కానీ 2021 లో వచ్చిన ఒక సినిమాలోని సాంగ్ నాకు నచ్చలేదని చెప్పాడు.
ఆ సాంగ్ ఏంటంటే అని ఆలోచిస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ 2021 లో మన సినిమా సాంగ్స్ కూడా వచ్చాయి కొంపదీసి ఆ సాంగ్సా ఏంటి అంటూ కామెడీ చేశాడు. దాంతో వాళ్ళందరూ నవ్వుకున్నారు మొత్తానికి అయితే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
జూనియర్ ఎన్టీఆర్ స్పాంటినెస్ గా కొన్ని పంచులు అయితే వేస్తూ ఉంటాడు. అలాగే రామ్ చరణ్ కూడా తనదైన రీతిలో వాటికి స్పందిస్తూ ఉండటం విశేషం… ఇక వీళ్ళ కాంబోలో వచ్చిన ‘త్రిబుల్ ఆర్’ సినిమాను చూసి యావత్ ప్రేక్షకులోకమంతా ఆనందపడ్డారనే చెప్పారు. ఆ సినిమా చూస్తుంటే ప్రతి ఒక్క కూడా ప్రేక్షకుడు కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యారు… ప్రస్తుతం వీళ్ళిద్దరూ ఎవరి ప్రాజెక్టులో వాళ్ళు బిజీగా ఉంటూ ముందుకు సాగుతున్నారు.
రామ్ చరణ్ చేసిన గేమ్ చేంజర్ ఆశించిన మేరకు విజయం సాధించలేదు. దాంతో ఆయన ఇమేజ్ కొంతవరకు డామేజ్ అయిందనే చెప్పాలి. ఇక ఎన్టీఆర్ సైతం గత సంవత్సరం దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుగు వచ్చి మంచి విజయాన్ని అందుకోవడం విశేషం… ఫ్యూచర్ లో వచ్చే సినిమాల మీద వీళ్ళు భారీ కసరత్తులను చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…