iBomma Ravi case facts: గత కొన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న పైరసీని అరికట్టే నేపథ్యంలో చాలామంది పోలీసులు తీవ్రమైన ప్రయత్నం చేశారు. ఇక అందులో భాగంగానే సైబర్ పోలీసులు ఐ బొమ్మ నిర్వాహకుడు అయిన ఇమ్మాడి రవిని రీసెంట్ గా అరెస్ట్ చేశారు… ఇక దాంతో హైదరాబాద్ సీపీ సజ్జనార్ తో సినీ పెద్దలు బేటీ అయ్యారు. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజులతో పాటు మరికొంతమంది ఈ భేటీలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఇక సజ్జనార్ రవి గురించి పూర్తి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాడు…రవి స్వస్థలం విశాఖ, ఆయన బీఎస్సీ కంప్యూటర్స్ చదివాడు… కొద్దిరోజుల పాటు జాబ్ చేసిన ఆయన మహారాష్ట్రలో వివిధ పేర్లతో డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు పాన్ కార్డ్ కూడా తీసుకున్నాడట. ఇక ఇండియాలో ఉంటే వర్కౌట్ అవ్వదు అనే ఉద్దేశంతో కరేబియన్ దీవుల్లో ఉంటూ నెవిస్ దేశ పౌరసత్వాన్ని తీసుకున్నాడు…
2019వ సంవత్సరంలో ఐ బొమ్మను సైట్ ని స్టార్ట్ చేశాడు… 110 డొమైన్స్ ని కొనుక్కున్నాడు. ఇక సైట్ బ్లాక్ చేస్తే మరొక సైట్ నుంచి అప్లోడ్ చేస్తుండేవాడట… ఇప్పటి వరకు తను 21 వేల సినిమాలను పైరసీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ పైరసీ ద్వారా ఆయన 20 కోట్ల వరకు డబ్బులైతే సంపాదించాడు.
ప్రస్తుతం మూడు కోట్ల రూపాయలను సీజ్ చేసినట్టుగా సజ్జనార్ తెలియజేశాడు…ఇక తన దగ్గర 1972లో రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ దగ్గర నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన ఓజి సినిమా వరకు అన్ని సినిమాలు ఉన్నాయని తెలియజేశాడు. ఇక 50 లక్షల సబ్స్క్రైబర్ల డాటా కూడా తన దగ్గర ఉందని తెలియజేశాడు.
ప్రస్తుతం ఆ డాటా తన దగ్గర ఉండడం ఇబ్బంది అని దాంతో సైబర్ నేరగాళ్లు ఏదైనా చేయడానికి అవకాశం ఉందని తెలియజేశారు…ఇక రవి మీద ఐటీ యాక్ట్, కాపీ రైట్స్ కింద మరో 4 కేసులు పెట్టినట్టుగా సజ్జనార్ తెలియజేశాడు…ఇక మీదటైన ఇండస్ట్రీలో పైరసీ కట్టడి అవుతోందా..? లేదా అనేది తెలియాల్సి ఉంది…