Kantha 3-day collections: ‘లక్కీ భాస్కర్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత దుల్కర్ సల్మాన్(Dulquer Salman) చేసిన చిత్రం ‘కాంతా'(Kantha Movie). దగ్గుబాటి రానా(Daggubati Rana) నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా, ప్రధాన పాత్ర కూడా ఈ సినిమాలో పోషించాడు. ప్రముఖ తమిళ నటుడు/ సింగర్ త్యాగరాజ భగవతార్ జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విడుదలకు ముందే వివాదాల్లో కూడా ఈ చిత్రం చిక్కుకుంది. తమ తాత చరిత్ర ని వక్రీకరిస్తున్నారని కోర్టు పిటీషన్స్ కూడా వేశారు. అలా కొన్ని చిక్కిముడులను విప్పుకొని రీసెంట్ గానే విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ వచ్చింది. ఒక్కరు కూడా ఈ చిత్రాన్ని చూసి సూపర్ గా ఉంది అని అనలేకపోతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆడియన్స్ లో ఎలాంటి టాక్ వచ్చింది అనేది. మూడు రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఇంతా వసూళ్లను రాబట్టిందో చూద్దాం.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మూడవ రోజున అన్ని భాషలకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల 50 లక్షల రూపాయిలు వచ్చాయట. అంటే షేర్ కనీసం 3 కోట్ల 50 లక్షల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. ఇక తెలుగు రాష్ట్రాల్లో మూడవ రోజున ఈ చిత్రానికి 73 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మూడు రోజుల్లో 2 కోట్ల 66 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 5 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే తమిళ నాడు నుండి దాదాపుగా 6 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కేరళ నుండి 2 కోట్ల 64 లక్షలు, కర్ణాటక నుండి 1 కోటి 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 30 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు ఓవర్సీస్ నుండి 9 కోట్ల 30 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల 64 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, 12 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. అంటే ఇంకా 18 కోట్లు రావాలి. నేటి కలెక్షన్స్ ని బట్టి ఈ సినిమా ఫుల్ రన్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా డిజాస్టర్ వైపు అడుగులు వేస్తోంది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.