Bigg Boss Telugu 8: డిజాస్టర్ అవ్వాల్సిన ఈ బిగ్ బాస్ సీజన్, పర్వాలేదు యావరేజ్ అని అనిపించడానికి ముఖ్య కారణం వైల్డ్ కార్డ్స్. ఈ వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ గా హౌస్ లోపలకు అడుగుపెట్టిన వారిలో రోహిణి కారణంగా బిగ్ బాస్ కి బోలెడంత టీఆర్ఫీ కంటెంట్ వచ్చింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టేస్టీ తేజ, అవినాష్ తో కలిసి ఆమె పెదనించిన కామెడీ, అదే విధంగా హౌస్ లో ఉన్నన్ని రోజులు తన తోటి కంటెస్టెంట్స్ తో వ్యవహరించిన తీరు ఆడియన్స్ కి చాలా బాగా నచ్చింది. ఈమె కేవలం ఎంటర్టైన్మెంట్ ని మాత్రమే అందిస్తుంది, హౌస్ లో ఇక దేనికి పనికిరాదు అని ఈమెని చులకన చూపుతో చూసిన హౌస్ మేట్స్ చాలా మంది ఉన్నారు. ఒకానొక దశలో ఆమె టేస్టీ తేజతో మాట్లాడుతూ కమెడియన్స్ విన్నెర్స్ అవ్వరురా..కేవలం మనలో కామెడీ ని మాత్రమే చూస్తారు, జనాలు మనల్ని సీరియస్ గా తీసుకోరు అని అంటుంది.
ఆమె మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. హౌస్ లోకి వచ్చిన ఆమె కుటుంబం కానీ, గెస్ట్స్ కానీ, స్నేహితులు కానీ, మీరు కమెడియన్స్ కాదు, గేమర్స్, ఎప్పుడూ అలా అనుకోకండి అని చెప్పుకొచ్చారు. ఇక గౌతమ్ అయితే రోహిణి కి ఇచ్చిన మనోధైర్యం మామూలుది కాదు. మీరు కమెడియన్స్ అని మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీరు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ని అందించగలరు, అదే సమయంలో టాస్కులు కూడా ఆడగలరు. మాకు కేవలం టాస్కులు ఆడడం మాత్రమే వచ్చు, కానీ మీకు ఎంటర్టైన్మెంట్ ని అందించడం కూడా వచ్చు, కాబట్టి మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ చేసుకోకండి అని చెప్పేవాడు. అలా తన మంచి కోరుకునే ఇద్దరు ముగ్గురు హౌస్ లో ఉండడం తో రోహిణి లో మనో ధైర్యం పెరిగింది. ముఖ్యంగా టాస్కుల విషయంలో ఆమెకు కసి వేరే లెవెల్ లో పెరిగింది.
అప్పటి నుండి తనకి టాస్కులు ఆడేందుకు అవకాశం వచ్చినప్పుడల్లా అద్భుతంగా ఆడుతూ ముందుకు దూసుకుపోయింది. తన రెండు కాళ్ళు బాగాలేకపోయినప్పటికీ కూడా మగవాళ్ళతో సమానంగా గేమ్ ఆడింది. పృథ్వీ, విష్ణు ప్రియ లాంటోళ్ళు నువ్వు గేమ్స్ ఆడలేవంటూ పొగరుతో బాడీ షేమింగ్ చేసి మాట్లాడుతారు. ఎవరైతే తనని అలా అవమానించారో, వాళ్ళ మీదనే ఈమె టాస్కులు గెలిచి శివంగి అని అనిపించుకుంది. కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఈమె ఆట తీరుని విపరీతముగా మెచ్చుకున్నారు. ఈమెకు పడినటువంటి ఈ ఎపిసోడ్ ఏ కంటెస్టెంట్ కి కూడా పడలేదు. అంతా బాగానే ఉంది కానీ రోహిణి ఒక్కసారి కూడా నామినేషన్స్ లోకి రాకపోవడం వల్లే, ఈరోజు ఆమె ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కారణంతో పాటుగా ఆమె హౌస్ లో ఎక్కువగా గ్రూప్ గేమ్స్ ఆడడం కూడా ఆడియన్స్ కి నచ్చలేదు, అందుకే ఓటింగ్ రాక ఎలిమినేట్ అయ్యిందని సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.