Pawan Kalyan Bro Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో తమ అభిమాన హీరో ని వెండితెర మీద చూస్తామా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ‘భీమ్లా నాయక్’ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నుండి సినిమా వచ్చి ఏడాదికి పైనే అవుతుంది. ఇప్పుడు ఆయన వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అందులో ‘బ్రో ది అవతార్’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని వచ్చే నెల 28 వ తారీఖున విడుదల కాబోతుంది.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ విడుదలై ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా చిత్తం’ అనే సినిమాకి రీమేక్ గా ఇది తెరకెక్కుతుంది. కేవలం స్టోరీ లైన్ ని తీసుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెచ్చే విధంగా ఈ సినిమా స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడట డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.
ఈ సినిమాకి ఆయన మాటలు మరియు స్క్రీన్ ప్లే కూడా అందించగా, సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ఐటెం సాంగ్ ని ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతుల తో చిత్రీకరించారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్ కూడా ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గత వారమే టీజర్ విడుదల అవ్వాల్సి ఉంది, కానీ సాయి ధరమ్ తేజ్ తన మ్యానేజర్ తో గొడవ పెట్టుకోవడం వల్ల వాయిదా పడింది.
ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని వచ్చే వారం ప్రారంభంలోనే విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ టీజర్ పవన్ కళ్యాణ్ వింటేజ్ స్టైల్ తో పాటుగా, ఆయన మార్కు వెటకారం తో కూడిన డైలాగ్స్ కూడా ఉంటాయని. ఆ డైలాగ్స్ కి ఫ్యాన్స్ పూనకాలు వచ్చి ఊగిపోతారని చెపుతున్నారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ ని 16 వ తేదీన విడుదల అవ్వబోతున్న ‘ఆదిపురుష్’ మూవీ తో అటాచ్ చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం.