Balakrishna: నందమూరి నటసింహంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బాలయ్య బాబు బ్లాక్ బస్టర్ హిట్స్ ని కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఇలాంటి బాలయ్య పక్కన నటించిన హీరోయిన్లలో ది బెస్ట్ జోడి అనిపించుకున్న హీరోయిన్స్ ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ఒకప్పుడు బాలయ్య బాబు విజయశాంతి కాంబినేషన్ లో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పటివరకు వీళ్ళ కాంబినేషన్ లో 17 సినిమాలు వస్తే అందులో ఒకటి రెండు మినహాయిస్తే మిగిలిన అన్ని సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి. అందులో ముఖ్యంగా రౌడీ ఇన్స్పెక్టర్, మువ్వ గోపాలుడు, ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్ లాంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి…
తర్వాత బాలయ్య బాబుతో మంచి జోడీగా గుర్తింపు పొందిన హీరోయిన్ సిమ్రాన్…ఈమె తో సమర సింహరెడ్డి, నరసింహ నాయుడు, సీమ సింహం, ఒక్క మగాడు లాంటి సినిమాల్లో సిమ్రాన్ బాలయ్య పక్కన నటించి మెప్పించింది…ఇందులో సమర సింహ రెడ్డి నరసింహ నాయుడు ఇండస్ట్రీ హిట్లు గా నిలిచాయి…
ఇక వీళ్ల తర్వాత బాలయ్య బాబు తో నటించి బెస్ట్ జోడిగా నిలిచిన హీరోయిన్ నయనతార. ఇక వీళ్ళ కాంబో లో సింహా, శ్రీ రామరాజ్యం లాంటి సినిమాలు వచ్చాయి. ఇక ఇది ఇలా ఉంటే బాలయ్య పక్కన హీరోయిన్ గా నటించింది మెప్పించడం అంటే అంత సులభం కాదు. ఆయన గ్రేస్ ను, ఆయన స్పీడ్ ను అందుకునేలా ఉండాలి. అలాగే బాగా నటించి మెప్పించాలి. అలాంటప్పుడే ఆయనతో జోడీ సరిగ్గా సరిపోతుంది అని చాలా మంది సినీ మేధావులు సైతం ఎప్పుడు చెబుతూ ఉంటారు.
ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడున్న హీరోయిన్లలో బాలయ్య పక్కన కొంతమంది హీరోయిన్స్ నటిస్తున్నప్పటికి వాళ్ళు ఒక సినిమాకి మాత్రమే పరిమితం అవుతున్నారు. బాలయ్య పక్కన ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నారు. విజయశాంతి, సిమ్రాన్, నయనతార లాంటి హీరోయిన్స్ మాత్రం ఇప్పుడు దొరకడం లేదని బాలయ్య బాబు అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు…