Homeఎంటర్టైన్మెంట్Great Comedians:: తెలుగు సినిమా కోల్పోయిన గొప్ప హాస్య నటులు...

Great Comedians:: తెలుగు సినిమా కోల్పోయిన గొప్ప హాస్య నటులు వీళ్ళే !

Great comedians: ‘నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం’. అయితే, న‌టించ‌డం ఒక ఎత్తు, న‌వ్వించ‌డం మ‌రో ఎత్తు. అందుకే అన్ని పాత్ర‌ల‌తో పోల్చితే కామెడీ పాత్ర చాలా ఛాలెంజింగ్ పాత్ర‌. కాగా తమ హావభావాలతో హాస్యానికి చిరునామాగా నిలిచిన ఎందరో హాస్య నటులు మనకు ఉండేవారు. ద‌శాబ్ధాల పాటు తెలుగు తెర పై న‌వ్వులతో అలరించిన ఆ హాస్య నటులలో కొందరు దుర‌దృష్ట‌వశాత్తు తెలుగు ఇండ‌స్ట్రీ కోల్పోయింది. మరి తెలుగు తెరకు దూర‌మైన ఆ హాస్య నటుల గురించి తెలుసుకుందాం రండి.

ధర్మవరపు సుబ్రహ్మణ్యం:

Dharmavarapu Subramanyam
Dharmavarapu Subramanyam

ధర్మవరపు సుబ్రహ్మణ్యం మాట విరుపు గొప్ప నవ్వుల హరివిల్లు.. ఆయన టైమింగ్ గొప్ప కామెడీకి కేరాఫ్ అడ్రస్.. ఆయనే వెండితెర నవ్వుల మాస్టర్. ఆయన అమాయకమైన మొహం తో కన్నింగ్ లుక్ ఇచ్చి.. ‘అబ్బా.. మాక్కూడా తెలుసు బాబూ..’ అంటూ విరిచే మాటల విరుపులు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టాయి. పాత్ర ఏదైనా సరే.. తన వెటకారంతో తన స్పీడ్ మేనరిజంతో ఆకట్టుకోవడం ఆయనకు మాత్రమే సాధ్యమైన ప్రత్యేకత. ఇక ధర్మవరపు సుబ్రహ్మణ్యం అనగానే లెక్చరర్‌ పాత్రలు గుర్తుకువస్తాయి. ఆ పాత్రలకు ఆయన అంత గొప్పగా జీవం పోశారు.

1954 సెప్టెంబర్ 20న ప్రకాశం జిల్లాలోని బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెంలో పుట్టారు. ఒంగోలులోని సీఎస్‌ఆర్ కళాశాలలో పీయూసీ వరకు చదివారు. ఆ తర్వాత కొన్నాళ్ళు పాటు విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ గా కూడా జాబ్ చేశారు. అయితే జాబ్ పై ఆసక్తి లేకపోవడంతో నాటకాల్లోకి వచ్చారు. ఆ నాటకాల నుంచి కామెడీ సీరియల్‌ ఆనందో బ్రహ్మలో నటించారు. పైగా ఆ సీరియల్ కి ఆయనే రచయిత, అలాగే ఆయనే దర్శకుడు కూడా. ఆ తర్వాత కాలంలో జంధ్యాల సినిమా ‘జయమ్ము నిశ్చయమ్మురా’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత ‘బావా బావా పన్నీరు, స్వాతి కిరణం, పరుగో పరుగు, ష్‌ గప్‌చుప్‌, ఓహో నా పెళ్లంట, నువ్వే కావాలి, ఆనందం’ ఇలా అనేక సినిమాల్లో ఆయన ఎన్నో హాస్య పాత్రలు పోషించి మన హృదయాలలో శాశ్వతంగా స్థానాన్ని సంపాధించుకున్నారు.

Also Read: తాంబూలంగా తమలపాకులు మాత్రమే ఇవ్వడానికి గల కారణం ఏమిటో తెలుసా?

AVS ఎ.వి.ఎస్

Avs
Avs

ఎ.వి.ఎస్ అద్భుత హాస్య నటుడు. అలాగే మంచి రచయిత కూడా, అదే విధంగా దర్శకుడు కూడా. పైగా మొదటి సినిమాతోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు సాధించాడు. ఆయన పూర్తి పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. ఎ.వి.ఎస్ గా పేరు గాంచాడు. ఎ.వి.ఎస్ 1957వ సంవత్సరం జనవరి 2న జన్మించాడు. వీ.ఎస్‌.ఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశాడు. కాలేజీ రోజుల్లోనే రంగస్థల ప్రవేశం చేశాడు. సినిమాల్లోకి వచ్చాక, కేవలం 19 ఏళ్లలోనే ఏవీఎస్ 500 చిత్రాల్లో నటించి మెప్పించాడు. అంకుల్ సినిమాతో ఆయన నిర్మాతగా, సూపర్ హీరోస్ చిత్రం ద్వారా దర్శకుడుగా కూడా మారాడు.

వేణు మాధవ్:

venu madhav
venu madhav

ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ కూడా మంచి హాస్య నటుడు. నల్గొండ జిల్లా కోదాడలో జన్మించిన వేణు మాధవ్ 1996లో కృష్ణ హీరోగా దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి తెరకెక్కించిన సంప్రదాయం సినిమాతో తెలుగు తెరకు పరిచయ్యారు. విలక్షణ నటన, తెలంగాణ మాండలికంలో ఆయన చెప్పే డైలాగ్స్ కారణంగా అనతి కాలంలోనే టాప్ కమెడియన్ గా ఎదిగారు. లక్ష్మి సినిమాతో ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నారు.

తెలంగాణ శకుంతల:

 

venu madhav
venu madhav

తెలంగాణ శకుంతల మొదట్లో సీరియస్ రోల్స్ చేసి ఆ తర్వాత కామెడీతో అందర్ని కడుపుబ్బా నవ్వించింది. ఇంద్ర , ఒక్కడు , నువ్వు నేను లాంటి సినిమాలలో ఆమె పోషించిన పాత్రలు చాలా బాగుంటాయి.

ఎమ్ ఎస్ నారాయణ:

 

ms narayana
ms narayana

ఎమ్ ఎస్ నారాయణ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తూ సినిమాల్లోకి వచ్చారు. ఇడియట్, బన్ని, సొంతం, నువ్వు నేను ఇలా ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. దాదాపు 800 సినిమాల వరకు చేసాడు . త్రివిక్రమ్ మరియు శ్రీను వైట్ల సినిమాలలో ఆయన రోల్స్ బాగా పండాయి. గ్లిజరిన్ లేకుండా నిజంగానే ఏడుస్తూ నటించగలడు.

జయ ప్రకాష్ రెడ్డి:

jaya prakash reddy
jaya prakash reddy

ప్రముఖ నటుడు జయప్రకాశ్‌రెడ్డి విలన్ గా కమెడియన్ గా ఆయన నటనా గొప్పతనాన్ని గురించి భవిష్యత్తు తారలు మరియు తరాలు తరతరాలు గుర్తుపెట్టుకుంటాయి 1946 మే 8న జన్మించిన జయప్రకాశ్‌రెడ్డి.. బ్రహ్మపుత్రుడు చిత్రంతో రామానాయుడు సహాయంతో సినీ రంగంలో అడుగుపెట్టారు. ఆ తరువాత అవకాశాలు లేక మళ్లీ కొన్నాళ్ళు జాబ్ చేసి.. ఎలాగోలా మళ్లీ ఇండస్ట్రీకే వచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ముఖ్యంగా రాయలసీమ మాండలీకంతో ఆయన పలికే మాటలు అలాగే కామెడీ విలనిజమ్ తో పాటు సీరియస్ విలన్ గానూ ఆయన పలు పాత్రలను పండించి తనకంటూ ప్రత్యేకమైన నటుడిగా నిలిచిపోయారు.

ఆహుతి ప్రసాద్:

 

ahuti prasad
ahuti prasad

ఆహుతి అనే సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కమెడియన్ గా , విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయనకు మంచి పేరు ఉంది. అయితే, చందమామ సినిమాలో ‘ఆహుతి ప్రసాద్’ వేసిన రామలింగేశ్వరరావు పాత్ర కూడా మిగిలిన పాత్రలను బాగా డామినేట్ చేస్తోంది. గొప్ప హాస్యాన్ని పండిస్తోంది.

మల్లికార్జున:

mallikarjuna
mallikarjuna

 

కమెడియన్ మల్లికార్జున కూడా గొప్ప హాస్య నటుడు. వెంకీ సినిమాలో జగదాంబ చౌదరిగా, పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో మల్లి గా ఆయన పండించిన కామెడీ చాలా గొప్పది.

కొండవలస లక్ష్మణరావు:

kondavalasa lakshmana rao
kondavalasa lakshmana rao

 

ఐతే ఒకే ఈ డైలాగ్ తో న్బగా ఫేమస్ అయ్యాడు. అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు , కబడ్డీ కబడ్డీ , ఎవడిగోల వాడిది లాంటి సినిమాలతో బాగా తెచ్చుకున్నారు.

గుండు హనుమంతరావు:

gundu hanumantha rao
gundu hanumantha rao

బుల్లితెర మీద నవ్వుల రేడు మన గుండు హనుమంతరావు. అమృతం సీరియల్ తో ఆయన అద్భుతమైన కామెడీని ఇచ్చి వెళ్లారు.

Also Read: గుండె నొప్పితో సౌర్య.. ఆపరేషన్ చేయలేని పరిస్థితిలో డాక్టర్ బాబు!

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

1 COMMENT

  1. […] Mahesh-Namrata: ప్రేమకు వయసుతో పని లేదు. అలాగే ప్రేమ కుల‌మ‌తాల‌ను కూడా చూడడు. ఇక వారి వృత్తి ప్రవృత్తిలను కూడా ప్రేమ పట్టించుకోదు. ప్రేమకు కావల్సింది మనసు. మనసు మనసు కనెక్ట్ అయితే.. వ‌య‌స్సు బేధాల‌ను ఆస్తుల ఐశ్వర్యాలు పట్టింపులోకి రావు. ఇదే విషయాన్ని విశ్వసనీయతతో రుజువు చేసిన కొన్ని సినిమా జంట‌లు ఉన్నాయి. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular