Tollywood Divorce Couple:టాలీవుడ్ లో విడాకులు తీసుకున్న స్టార్లు వీరే..

Tollywood Divorce Couple:సినీ ఇండస్ట్రీలో పెళ్లి బంధం కలకాలం నిలవడం తక్కువే. చాలా మంది ప్రముఖమైన వారు ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకోగా.. మరికొందరు చేసుకున్న పెళ్లిని ఏడాది తిరిగేలోపే రద్దు చేసుకుంటారు. చాలా ప్రాక్టికల్ లైఫ్ ను కొనసాగించే ఇలాంటి నటులు పెళ్లిళ్లను కూడా అంతే స్థాయిలో చూస్తారు. అందుకే విడిపోవడానికి ఎంతమాత్రం ఆలోచించరు. దేశంలోని సినీ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకొని విడిపోయిన వారి సంఖ్య చాలా ఎక్కువే. ఇక ఇద్దరూ సినీ ఇండస్ట్రీకి చెందని […]

Written By: SHAIK SADIQ, Updated On : November 11, 2022 12:57 pm
Follow us on

Tollywood Divorce Couple:సినీ ఇండస్ట్రీలో పెళ్లి బంధం కలకాలం నిలవడం తక్కువే. చాలా మంది ప్రముఖమైన వారు ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకోగా.. మరికొందరు చేసుకున్న పెళ్లిని ఏడాది తిరిగేలోపే రద్దు చేసుకుంటారు. చాలా ప్రాక్టికల్ లైఫ్ ను కొనసాగించే ఇలాంటి నటులు పెళ్లిళ్లను కూడా అంతే స్థాయిలో చూస్తారు. అందుకే విడిపోవడానికి ఎంతమాత్రం ఆలోచించరు. దేశంలోని సినీ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకొని విడిపోయిన వారి సంఖ్య చాలా ఎక్కువే. ఇక ఇద్దరూ సినీ ఇండస్ట్రీకి చెందని వారైతే వారి గురించి కొందరు ముందే చెబుతున్నారు. అయితే తెలుగులో స్టార్ హీరోలు, నటులు పరిస్థితి కూడా అంతే. కొందరు సంవత్సరాలుగా కాపురం చేసి పిల్లలు కన్నాక కూడా విడిపోయిన వారున్నారు. అలాంటి వారి గురించి తెలుసుకుందాం..

పవన్ కల్యాణ్:
పవన్ స్టార్ పవన్ కల్యాణ్ మొదటగా పెద్దల సమక్షంలో నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల వీరిద్దరు కలిసుండలేదు. దీంతో 2008లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత రేణుక దేశాయ్ ని పెళ్లిచేసుకొని ఇద్దరు పిల్లలు పుట్టాక 2012లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం రష్యా నటి అన్నా లెజ్నావెని తో కలిసి ఉంటున్నారు.

నాగార్జున:
అక్కినేని నాగార్జున పెద్దల సమక్షంలో ప్రముఖ నిర్మాత రామానాయుడు కూతురు లక్ష్మిని 1984లో పెళ్లి చేసుకున్నారు. వీరికి చైతన్య పుట్టాడు. ఆ తరువాత 1992లో నటి అమలను వివాహం చేసుకున్నాడు

నాగచైతన్య -సమంత:
‘ఏమాయ చేశావె’ సినిమతో కలిసి నటించిన నాగచైతన్య, సమంతలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు.

కీర్తిరెడ్డి -సుమంత్:
ఈ ఇద్దరూ సినీ ఇండస్ట్రీకి చెందిన వారే. 2004లో పెళ్లి చేసుకున్న వీరు 2006లో విడాకులు తీసుకున్నారు. సుమంత్ ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. కానీ కీర్తిరెడ్డి మాత్రం 2014లో లండన్ కు చెందిన ఓ వైద్యుడిని వివాహం చేసుకున్నారు.

ప్రకాశ్ రాజ్:
విలక్షణ నటుడిగా పేరున్న ప్రకాశ్ రాజ్ లలితా కుమారిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 2009లో విడాకులు ఇచ్చాడు. 2010లో ప్రముఖ డ్యాన్సర్ సోనీ వర్మను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.

కమలహాసన్:
సౌత్ స్టార్ నటుడు కమలమాసన్ 1978లో వాణి గణపతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత ఆమెకు విడాకులిచ్చి 1988లో సారికను వివాహం చేసుకున్నారు. వీరికి శృతిహాసన్, అక్షర హాసన్ లు పుట్టారు. 2004లో సారికకు విడాకులిచ్చారు. ఆ తరువాత నటి గౌతమితో సహజీవనం చేశారు. ఇటీవల గౌతమి కూడా కమలాసన్ కు దూరమైంది.

శరత్ బాబు:
సీనియర్ నటుడు శరత్ బాబు 1981లో రమాప్రభను పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత ఆమెకు విడాకులు ఇచ్చి 1990లో స్నేహ నంబియార్ ను వివాహం చేసుకున్నాడు. ఆమెకు కూడా దూరంగానే ఉంటున్నారు.

రాధిక శరత్ కుమార్:
ప్రముఖ నటి రాధిక 1985లో ప్రతాప్ పోతన్ ను పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఆయనకు విడాకులు ఇచ్చి..లండన్ కు చెందిన రిచర్డ్ హ్యార్లీని పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత 2001లో నటుడు శరత్ కుమార్ ను పెళ్లి చేసుకున్నారు.

సునీత:
ప్రముఖ గాయని సునీతకు తొలుత కిరణ్ తో వివాహమైంది. వీరికి శ్రేయ, ఆకాశ్ అనే పిల్లలున్నారు. భర్తకు విడాకులు ఇచ్చిన 2021 రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకున్నారు.

మంచుమనోజ్:
ప్రముఖ నటుడు మోహన్ బాబు రెండో కుమారుడు, హీరో మంచు మనోజ్ ప్రణీత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారు. ప్రస్తుతం మనోజ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.