Hanuman: దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వస్తున్న హనుమాన్ సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి దానికి కారణం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ గాని, ట్రైలర్ గాని ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఒక దశలో అయితే ప్రభాస్ హీరో గా వచ్చిన అదిపురుష్ సినిమా కంటే ఈ సినిమాలో వాడిన గ్రాఫిక్స్ వర్క్ చాలా బాగుంది అంటు కామెంట్లు కూడా చేశారు.
ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాని మొదటగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరో అయిన అల్లు అర్జున్ తో చేద్దామని ప్రశాంత్ వర్మ అనుకున్నాడు. కానీ అల్లు అర్జున్ కి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల ఈ సినిమా చేయడం వీలు కాలేదు. ఇక దాంతో తరువాత తనకి మొదటి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నాని ని హీరో గా పెట్టీ చేయాలనుకున్నాడు. నాని కూడా వాళ్ల ఓన్ బ్యానర్ లోనే ఈ సినిమాని తెరకెక్కించాలని అనుకున్నాడు. కానీ బడ్జెట్ ప్రాబ్లం రావడం తో నాని.కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.ఇక దాంతో ప్రశాంత్ వర్మ తన ఫ్రెండ్ అయిన తేజ సజ్జా ని ఈ సినిమా లో హీరో గా తీసుకొని ఆయన చేత ఈ సినిమా చేయాలనుకున్నాడు.
అయితే ఇంతకుముందే వీళ్ళ కాంబినేషన్ లో జాంబిరెడ్డి అనే సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ కాంబినేషన్ ని మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయాలని ప్రశాంత్ వర్మ అనుకొని తేజ సజ్జా ని హీరో గా పెట్టి ప్రశాంత్ వర్మ చాలా తక్కువ బడ్జెట్ లోనే ఈ సినిమాని బెస్ట్ అవుట్ పుట్ తో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అందులో తను సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అయితే ఈ సినిమాని అల్లుఅర్జున్ లాంటి స్టార్ హీరోతో చేస్తే ఆ సినిమా స్పాన్ ని పెంచి బడ్జెట్ ని భారీగా పెంచి పెద్ద సినిమాగా చేయాలనుకున్నాడు. కానీ తేజ సజ్జా కి అంత పెద్ద మార్కెట్ లేదు కాబట్టి ఆయన కూడా అప్ కమింగ్ హీరోనే కాబట్టి అతనికి ఎక్కువగా మార్కెట్ లేదు కాబట్టి అతని మార్కెట్ లోనే పాసిబుల్ అయ్యేవిధంగా ఈ సినిమాని తెరకెక్కించాడు.
మరి ఈ సినిమా సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమా సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా హిట్ అయితే ప్రశాంత్ వర్మ కి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ఈ సినిమాతో కనక సక్సెస్ కొడితే స్టార్ హీరోలు అందరూ ప్రశాంత్ వర్మ తో సినిమా చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ని చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి…