Bigg Boss 9 Telugu: టెలివిజన్ రంగంలోనే ఇప్పటివరకు ఏ షోకి రానంత గుర్తింపును సంపాదించుకున్న ఏకైక రియాల్టీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ అనే చెప్పాలి…ఇప్పటివరకు టాప్ టిఆర్పి రేటింగ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు ఎనిమిది సీజన్లను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు 9వ సీజన్ కోసం రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇక అందులో భాగంగానే ఏడోవ తేదీ నుంచి ఈ షో స్టార్ మా లో టెలికాస్ట్ అవ్వబోతోంది. ఇక అందులో భాగంగానే ఈ షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్ల వివరాలను బిగ్ బాస్ యాజమాన్యం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్లు పదిమందిని అనౌన్స్ చేసిన బిగ్ బాస్ యాజమాన్యం కామన్ మ్యాన్స్ ను సైతం ఈ సీజన్లో భాగం చేయాలనే ఉద్దేశ్యంతో అగ్నిపరీక్ష అంటూ ఒక గేమ్ షో ని కండక్ట్ చేశారు. అందులో పాల్గొన్న 45 మంది నుంచి మొదటగా 15 మందిని సెలెక్ట్ చేశారు. అందులో నుంచి మొదట ఐదు మందిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తాం అంటూ అనౌన్స్ చేసినప్పటికి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఐదుగురు కాకుండా ఆరుగురు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే వాళ్ళను ఫైనల్ చేసిన బిగ్ బాస్ యాజమాన్యం రేపు సాయంత్రం ఆ లిస్టును కన్ఫామ్ చేస్తూ అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆరుగురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. మరి వారు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం…
Also Read: ఢీలో అన్షుతో రాజుగాడి ప్రేమ.. కుళ్లుకొని చచ్చిన హైపర్ ఆది…
మొదట దమ్ము శ్రీజ ను సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది…ఆమె అగ్ని పరీక్ష లో ప్రతి టాస్క్ ను చాలా తెలివిగా ఆడింది…
ఇక రెండోవ ప్లేస్ లో మాస్క్ మ్యాన్ హరీష్ ను సెలెక్ట్ చేశారు…ఆయన ఏ టాస్క్ చేసిన అందులో తన ఐడెంటిటి చూపించే ప్రయత్నం చేశాడు…
ఇక మూడో ప్లేస్ లో ఆర్మీ పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేశారు…ఈయన సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న ఇష్టంతో తన జబ్ ను కూడా వదులుకోవడానికి రెడీ అయ్యాడు కాబట్టి ఆయన్ని సెలెక్ట్ చేశారు…
నెంబర్ ఫోర్ లో ప్రియ శెట్టి గారిని సెలెక్ట్ చేశారు…ఈమె కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తుందనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది…
నెంబర్ ఫైవ్ లో మర్యాద మనీష్ ను సెలెక్ట్ చేశారు…ఈయన ఒక టాస్క్ గెలవడం కోసం ఏదైనా చేస్తాడు అందుకే ఆయన్ని తీసుకున్నారు…
నెంబర్ సిక్స్ లో హీ మ్యాన్ పవన్ ను సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది… మొత్తానికైతే వీళ్ళంతా బిగ్ బాస్ లో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది…