Rajinikanth Bad Habits: సినీ ప్రపంచం మొత్తం రంగుల మయం.. ఒక్క చాన్స్ వస్తే జీవితమే మారిపోతుంది… అంతకుముందు ఏ పని చేసినా సినిమాల్లో చాన్స్ వస్తే అస్సలు వదులుకోరు.. అయితే సినిమాల్లోకి రాగానే అదృష్టం కొద్దీ కొందరు స్టార్లు అయిపోతారు.. దీంతో చేతినిండా డబ్బే.. డబ్బొచ్చాక అలవాట్లన్నీ మారిపోతాయి. అప్పటి వరకు ఒక్క పూట భోజనం చేసినవారు మూడు పుటలా కడుపు నింపుకుంటారు. ఇదే సమయంలో కొందరు వ్యసనాల బారిన పడుతారు. అయితే ఈ విషాలు ఏ నటుడు బయటపెట్టడు.. తాను జీవితంలో పడిన కష్టాల గురించి చెప్పుకుంటారు.. కానీ తనకున్న బ్యాడ్ హాబిట్స్ బయటపెట్టరు.. కానీ మన సూపర్ స్టార్ రజనీకాంత్ ఖుల్లంఖుల్లం చేశాడు.. తనకు ఎలాంటి చెడ్డ అలవాడ్లు ఉండేవో చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆయన అలవాట్ల సంగతేంటో చూద్దామా.
నటుడు, రచయిత వైజీ మహేంద్ర ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రజనీకాత్ తన పర్సనల్ విషయాలను బయటపెట్టాడు. జీవితంలో ఎదగడానికి రజనీకాంత్ పడ్డ కష్టాలు మాములువేం కాదు. బస్ కండక్టర్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఇప్పుడు పాన్ ఇండియ హీరో. ఆ కాలంలో ఆయన ఫీల్డ్ వర్క్ చేయడం వల్ల ఎన్నో అలవాట్లు ఉండేవి. అవసరాన్ని భట్టో.. పరిస్థితుల వల్లో తెలియదు గానీ.. ఈ అలవాట్లలో కొన్ని చెడ్డవి కూడా ఉన్నాయి. కానీ వాటిని మానుకోవడం ఆయన తరం కాలేదు. అంతేకాకుండా అప్పుడవి ఫ్యాషన్..!!
సినిమాల్లోకి రాకముందే రజనీకాంత్ భోజనం విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదట. రోజుకు రెండు పూటల మటన్ ఉండేదట. మటన్ ముక్క లేకపోతే ముద్ద దిగేదట. కష్ట కాలంలోనూ రజనీ తిండి విషయంలో తక్కువ కాకుండా చూసుకునేవారట. ఇక మటన్ తో పాటు కచ్చితంగా ఆల్కహాల్ తీసుకునేవారట. రోజూ పెగ్గు పడందే నిద్ర పట్టేది కాదని రజనీ చెప్పాడు. ఇక సిగరెట్లకు లెక్కలేదని ఆయన చెప్పుకొచ్చాడు.
అయితే సినిమాల్లోకి వచ్చాక రజనీ చేతిలో మరిత డబ్బు ఆడింది. దీంతో ఇక ఈ అలవాట్లకు పట్టపగ్గాలే లేకుండా పోయాయి. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లోనే మటన్ పాయ తప్పనిసరిగా ఉండేదని అన్నారు. వీటితో పాటు అప్పం, చికెన్ కచ్చితంగా ఉండాలని ఆర్డర్ వేసేవాడట. అయితే ఇలాంటి బ్యాడ్ హాబిట్స్ మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. కానీ రజనీ ఇప్పటికీ యాక్టివ్ గా ఉంటారు. ఆయన వయసు 73 ఏళ్లు యంగ్ హీరోలకు పోటీ నిస్తూ ఇప్పటికీ సినిమాలు తీస్తున్నాడు.
ఆయన ఆరోగ్య రహస్యమేంటంటే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అని మాత్రం చెప్పరు. ఎందుకంటే అప్పటి పరిస్థితి వేరే.. ఇప్పుడున్న వాతావరణం వేరు. ఏదీ ఏమైనా రజనీ అలవాట్లను చూసి సినీజనం షాక్ అవుతున్నారు. ప్రస్తుతం రజనీ చేతిలో మూడు సినిమాలతో బిజీగా మారాడు. తన కూతురు డైరెక్షన్లో వస్తున్న ‘లాల్ సలామ్’ సిద్దమవుతోంది. ఆ తరువాత మరో రెండింటిని లైన్లో పెట్టాడు. ఆ రెండు తరువాత సినిమాలకు గుడ్ బై చెబుతారన్న ఓ న్యూస్ బయటకు వచ్చింది. మరి ఈ సమయంలో రజనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.