https://oktelugu.com/

Heroines Prostitute Role: వేశ్య పాత్రలో నటించి మెప్పించిన 10 మంది స్టార్ హీరోయిన్లు వీరే..

హీరోయిన్లు అందచందాలతో పాటు కొన్ని ప్రత్యేక పాత్రలో నటించడం ద్వారా విస్తృతంగా అవకాశాలు వస్తూ ఉంటాయి. నాటి కాలంలో కొందరు హీరోయిన్లు పరిమిత పాత్రల్లో నటించేవారు. కానీ ఇప్పటి తరంలో పోటీ పెరగడంతో హీరోయిన్లు ఏ పాత్ర చేయడానికి అయినా ముందుకు వస్తున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 3, 2023 / 11:30 AM IST

    Heroines Prostitute Role

    Follow us on

    Heroines Prostitute Role: సమాజంలో వేశ్యలంటే చిన్న చూపు ఉంది. కానీ వారు కూడా మనుషులే. వారికి అన్ని అవసరాలు ఉంటాయి. కడుపు తిప్పల కోసమే వారు ఈ వృత్తిలోకి దిగుతున్నారు.. అని చెబుతూ కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాల్లో వేశ్యగా నటించాలంటే చాలా మంది ఇష్టపడరు. కానీ కొందరు స్టార్ హీరోయిన్లు ఈ పాత్రలో నటించడానికి ముందుకు వచ్చారు. అంతేకాకుండా వారు నటించిన ఆ సినిమాలు హిట్టు కొట్టాయి కూడా. సినిమాల్లో ఛాన్సులు రావడమే అరుదు. అలాంటి అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకెళ్తేనే స్టార్ గా కొనసాగుతారు.

    హీరోయిన్లు అందచందాలతో పాటు కొన్ని ప్రత్యేక పాత్రలో నటించడం ద్వారా విస్తృతంగా అవకాశాలు వస్తూ ఉంటాయి. నాటి కాలంలో కొందరు హీరోయిన్లు పరిమిత పాత్రల్లో నటించేవారు. కానీ ఇప్పటి తరంలో పోటీ పెరగడంతో హీరోయిన్లు ఏ పాత్ర చేయడానికి అయినా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా వేశ్యపాత్రలో నటించడానికి అయినా స్టార్ హీరోయిన్లు సైతం ఒప్పుకుంటున్నారు. అనుష్క నుంచి బిందు మాధవి వరకు కొంతమంది హీరోయిన్లు వేశ్యపాత్రలో నటించి మెప్పించారు. అలాంటి హీరోయిన్లలో కొంతమంది గురించి తెలుసుకుందాం..

    అనుష్క:
    స్టార్ హీరోయిన్లలో అనుష్క ఒకరు. అగ్ర హీరోలైన నాగార్జున, వెంకటేష్ లతో నటించిన అనుష్క.. బాహుబలి సినిమాలో నటించి పాన్ ఇండియా లెవల్లో పేరు తెచ్చుకుంది. కానీ అనుష్క కూడా వేశ్య పాత్రలో నటించమంటే వెంటనే ఒప్పేసుకుంది. ప్రతి పాత్ర సినిమాకు కీలకమే అని ‘వేదం’ సినిమాలో వేశ్యపాత్రతో అందరినీ మెప్పించింది.

    అనసూయ:
    యాంకర్ నుంచి స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ వేశ్య పాత్రలో నటించింది. ఇటీవల రిలీజ్ అయినా ‘విమానం’ సినిమాలో ఆమె యాక్టింగ్ కు మంచి మార్కలే పడ్డాయి. రాబోయే చిత్రం ‘వుల్ఫ’లోనూ ఇదే పాత్ర ఉంటుందని సమాచారం.

    శ్రీయ:
    స్టార్ హీరోయిన్ గా రాణించిన వారిలో శ్రియ ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరితో నటించిన ఈ భామ ‘పవిత్ర’ అనే సినిమాలో వేశ్య పాత్ర చేసింది.

    శృతి హాసన్:
    కమలాసన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ‘శృతిహాసన్’ కూడా వేశ్య పాత్రలో నటించింది. అయితే ఆమె హిందీ మూవీ ‘డీడే’ అనే సినిమాలో నటించింది. ఇందులో పాకిస్తాన్ కు చెందిన వేశ్యగా కనిపిస్తుంది.

    రమ్యకృష్ణ:
    అలనాటి నటి రమ్యకృష్ణ సైతం వేశ్య పాత్రలో నటించి మెప్పించింది. ‘సూపర్ డీలక్స్’ అనే సినిమాలో రమ్యకృష్ణ నటనకు అందా షాక్ అయ్యారు.

    సంగీత:
    తెలుగు, తమిళ్ లో గుర్తింపు తెచ్చుకున్న సంగీత ‘ధనం’ అనే సినిమాలో వేశ్యగా నటించి మెప్పించింది.

    ఛార్మి:
    అందాల తార ఛార్మీ కూడా వేశ్య పాత్రలో మెప్పించింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘జ్యోతిలక్ష్మి’తో పాటు

    స్నేహ:
    ఫ్యామిలీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న స్నేహ ను చూస్తే సాంప్రదాయ పాత్రల్లో మాత్రమే నటిస్తుందని అనుకున్నారు. కానీ ‘దూల్ పేట’ అనే సినిమాలో స్నేహ వేశ్య పాత్రలో నటించి మెప్పించింది.

    సదా:
    ‘జయం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ‘టార్చ్ లైట్’ అనే సినిమాలో వేశ్యగా కనిపించి మెప్పించింది.

    బిందుమాధవి:
    ‘అవకాయ బిర్యానీ’ సినిమాతో తెరంగేట్రం చేసిన బిందుమాధవి ఇటీవల బిగ్ బాస్ టైటిల్ కొట్టిన విషయం తెలిసిందే. ఆమె ‘సెగ’ అనే సినిమాలో వేశ్య పాత్రలో కనిపిస్తుంది.