Radhe Shyam: పబ్లిసిటీ అనేది సినిమాకు ప్రాణం. జనంలోకి సినిమాని తీసుకువెళ్లాలి అంటే ముందు చేయాల్సిన పని ఫ్యాన్స్ ను హ్యాపీ గా ఉంచడం. ఎందుకంటే.. సినిమా నుంచి ఏ పోస్టర్ రిలీజ్ అయినా, ఏ టీజర్ రిలీజ్ అయినా దాన్ని వైరల్ చేసేది ఫ్యాన్సే. కాబట్టి ముందు మేకర్స్ ఫ్యాన్స్ ఇష్టాలను గమనించి వాటికీ తగ్గట్టు సినిమానే కాదు, సినిమా ప్రమోషన్స్ ను కూడా ప్లాన్ చేసుకోవాలి.

అయితే పబ్లిసిటీ అనే విషయంలో అతి దారుణంగా ఫెయిల్ అయింది ‘రాధే శ్యామ్'(Radhe Shyam) టీమ్. ఈ సినిమా నుంచి సరైన అప్ డేట్ రావడం లేదు అని ప్రభాస్ అభిమానులు బాగా నిరాశలోకి వెళ్లిపోయారు. సూసైడ్ నోట్లు రాయడంతో పాటు నిర్మాతలను బండ బూతులు తిట్టే స్థాయికి వెళ్లిపోయారు. అసలు సోషల్ మీడియా వేదికగా ‘రాధే శ్యామ్’ టీమ్ పై చేసిన ట్రోల్స్ తో ట్విట్టర్ అండ్ ఇంస్టాగ్రామ్ ఎకౌంట్స్ అన్నీ నిండిపోయాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు.
ఇక ఇలాంటి పరిస్థితుల్లో నిన్న తొలి పాటను రిలీజ్ చేసింది టీమ్. ‘ఎవరో వీరెవరో కలవని ప్రేమికులా… ఎవరో వీరెవరో.. విడిపోని యాత్రికులా’ అంటూ సాగిన ఈ పాటను యానిమేషన్ పాటలా తీర్చిదిద్దారు. అయితే, ఇది ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. ఆడియో పరంగా విజువల్స్ పరంగా పాట బాగున్నా.. పాటలో ప్రభాస్ ను కనీసం ఒక్క షాట్ లో కూడా చూపించకపోవడంతో ఫ్యాన్స్ బాగా విసిగిపోయారు.
ఈ లిరికల్ వీడియోలో ప్రభాస్ ను బదులు అసలు యానిమేషన్ ను ఎలా చూపిస్తారు ? అంటూ ఫ్యాన్స్ మళ్ళీ రచ్చకు దిగారు. గ్రాఫిక్స్ లో ప్రభాస్ ను చూపించిన విధానం మొత్తానికి అభిమానులకు ఏ మాత్రం మింగుడు పడడం లేదు. రియల్ గా ప్రభాస్ ను ఒక్క షాట్ లో చూపించినా మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం అని కామెంట్స్ చేస్తున్నారు.
అసలు ఇన్ని వాయిదాల వేసి.. చివరకు ఈ తోలుబొమ్మలాట చూపిస్తారా ? సిగ్గుందా ? మీకు ఎందుకయ్యా సినిమాలు ? అంటూ ప్రభాస్ అభిమానులు నిర్మాతల పై సీరియస్ అవుతూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. పాపం యువీ క్రియేషన్స్ వారు ప్రమోషన్స్ మొదలుపెట్టినా ప్రభాస్ అభిమానులు మాత్రం ట్రోలింగ్ ను ఆపడం లేదు.
అయినా నేషనల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే ప్రమోషన్స్ ఎలా ఉండాలి ? నేషనల్ రేంజ్ లో ఉండాలి. కానీ ‘రాధే శ్యామ్’ టీమ్ ప్రమోషన్స్ ను ఎలా చేస్తోంది ? అందుకు పూర్తి భిన్నంగా చేస్తోంది. కాబట్టి.. ఇప్పటికైనా తమ సినిమా ప్రమోషన్స్ ను పట్టించుకుని వేగవంతం చేస్తే బెటర్.