The Great Indian Kitchen: తెలుగు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ మీద పరాయి భాష చిత్రాల గురించి, వాటి గురించి రకరకాల కామెంట్స్ చేస్తుంటారు. ఈ నేపధ్య్మలో “ది గ్రేట్ ఇండియన్ కిచెన్” అనే మలయాళ సినిమా గురించి విపరీతమైన పాజిటివ్ టాక్ వినిపించింది. ఏమిటి నిజంగానే అంత గొప్ప సినిమానా ? పేరులోనే గ్రేట్ ఉన్నట్లు, సినిమా కూడా గ్రేట్ గానే ఉంటుందా ? ఒకసారి ఈ సినిమా సమీక్ష చూద్దాం.

ఈ సినిమా కథ చాలా ఆశ్చర్యకరమైన, చాలా చర్చనీయాంశమైన కధాంశంతో సాగుతుంది. ఒక హిందూ జంటకు కుదిరిన వివాహాన్ని చిత్రీకరించడంతో ఈ సినిమా మొదలు అవుతుంది. ఈ సదరు వివాహ పరిచయం నుండి అమ్మాయి అత్యంత సాంప్రదాయ మరియు ఆచారబద్ధమైన కుటుంబంలో వివాహం చేసుకుంటుందని చాలా స్పష్టంగా చూపించారు.
అక్కడ నుంచి ఎన్నో ఇబ్బందులు పడినా కొత్త పెళ్లికూతురు మౌనంగా ఉండడాన్ని ఎంచుకుంటుంది. అసలు కథ ఇక్కడ నుండి మొదలు.. ఇంటి భారం అంతా ఇప్పుడు ఈ నవ వధువుపై పడిపోతుంది. మామగారి చమత్కారాలు అన్ని ఇన్ని కావు, కుక్కర్‌లో వండిన అన్నం నచ్చదు, చట్నీని మిక్సర్‌లో రుబ్బితే నచ్చదు. బట్టలు వాషింగ్ మెషీన్ లో వేస్తే నచ్చదు.
Also Read: ఢీ మానేశాను కానీ అది మాత్రం మానను అంటున్న సుడిగాలి సుధీర్… అది ఏంటంటే ?
మొత్తానికి కొత్త వధువు జీవితం పనిమనిషి జీవితం అయిపోతుంది. ఇక ఆమెకు వంటగది మరియు బెడ్‌రూమ్‌లో భర్త గారి రెగ్యులర్ ఫీలింగ్స్ డిమాండ్ కి తగ్గట్టు ఉండడం తప్ప మరో లోకం లేదు. దీనికి తోడు ఆమెకు స్నేహితులు లేకుండ చేస్తారు, అలాగే ఆమెను టీవీని కూడా చుడనివ్వరు, నిజంగా బయటకు అడుగు కూడా పెట్టనివ్వరు.
ఇలా ఎన్నో విధాలుగా భాధలు అనుభవించిన తరవాత ఒక రోజున, వంటగదిలోని డ్రెయిన్ పైప్ నుంచి కారుతున్న మురికి కాలువలోని నీటిని భర్త గారికి,మామ గారికి టీగా కాసి, దాన్నే వాళ్లకు అందజేసి, చివరకు ఆ ఇంటి నుండి బయటకు వస్తుంది. తిరిగి రెక్కలు విచ్చుకున్న నాట్య మయూరిలా తన కెరీర్ డాన్స్ టీచర్ గా ఉద్యోగం చేసుకుంటూ తన కాళ్ళ మీద తాను నిలబడుతుంది.
Also Read: నా భర్త ఎప్పుడూ వాళ్లతోనే ఫోన్ మాట్లాడతాడు అంటున్న డాక్టర్ బాబు భార్య… ఎవరంటే ?