https://oktelugu.com/

Renu Desai : పవన్ కళ్యాణ్ కి వార్నింగ్ ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నా అంటూ రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్!

బద్రి చిత్రం కమర్షియల్ గా అప్పట్లో పెద్ద సూపర్ హిట్ కాగా, జానీ చిత్రం మాత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. జానీ తర్వాత సినిమాలు పూర్తిగా మానేసిన రేణు దేశాయ్, రీసెంట్ గా 'టైగర్ నాగేశ్వర రావు' చిత్రంలో ఒక కీలక పాత్ర ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 11, 2024 / 08:07 PM IST

    Renu Desai

    Follow us on

    Renu Desai : పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోయి చాలా ఏళ్ళు అవుతుంది. కానీ రేణు దేశాయ్ మాత్రం సందర్భం వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆమె పవన్ అభిమానులపై కోపం తెచ్చుకుంటూ ట్వీట్స్ వేయడం వంటివి కూడా చాలా సార్లు మనం గమనించే ఉంటాము. సోషల్ మీడియా లో వచ్చే నెగటివిటీ ని రేణు దేశాయ్ అసలు తీసుకోలేదు అని ఆమె రెస్పాన్స్ చూస్తే అందరికీ అర్థం అయ్యింది. ఒకప్పుడు ఆమెకు ట్విట్టర్ ఉండేది. కానీ నెగటివిటీ విపరీతంగా రావడంతో ఆమె తన ట్విట్టర్ ఖాతాని తొలగించింది. కానీ ఇంస్టాగ్రామ్ లో మాత్రం అప్పటి నుండి ఇప్పటి వరకు ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఈమెకు పెట్స్ అంటే ఎంతో ఇష్టం. వాటి బాగు కోసం ఈమె చేసే ప్రచారాలు, సోషల్ సర్వీస్ కార్యక్రమాలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

    అలాగే ఈమె అప్పుడప్పుడు తన కొడుకు అకిరా నందన్, కూతురు ఆద్య కి సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఈమె పవన్ కళ్యాణ్ సినిమా పై చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ తో ఈమె కలిసి ‘బద్రి’, ‘జానీ’ వంటి చిత్రాల్ నటించింది. బద్రి చిత్రం కమర్షియల్ గా అప్పట్లో పెద్ద సూపర్ హిట్ కాగా, జానీ చిత్రం మాత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. జానీ తర్వాత సినిమాలు పూర్తిగా మానేసిన రేణు దేశాయ్, రీసెంట్ గా ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రంలో ఒక కీలక పాత్ర ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. రాబోయే రోజుల్లో కూడా మంచి పాత్ర వస్తే కచ్చితంగా చేస్తాను అని ఇంటర్వ్యూస్ లో చెప్పింది.

    ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఒక పవన్ కళ్యాణ్ అభిమాని ఇంస్టాగ్రామ్ లో రేణు దేశాయ్ ని ట్యాగ్ చేస్తూ ‘పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో మీరు ఏ చిత్రం రీ రిలీజ్ కావాలని కోరుకుంటున్నారు?’ అని అడగగా, దానికి రేణు దేశాయ్ సమాధానం ఇస్తూ ‘బద్రి చిత్రం ఎప్పుడెప్పుడు రీ రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారికి నేను వార్నింగ్ ఇచ్చే సన్నివేశం ఒకటి ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం, ఆ సన్నివేశాన్ని ఒక్కసారి వెండితెర పై చూడాలని ఉంది’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. రీ రిలీజ్ ట్రెండ్ లో పవన్ కళ్యాణ్ రికార్డ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన సంగతి తెలిసిందే. బద్రి చిత్రం రీ రిలీజ్ కోసం కేవలం రేణు దేశాయ్ మాత్రమే కాదు అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు, న్యూ ఇయర్ రోజు ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.