కర్ణాటక లో ఇప్పటికే ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ ద్వారా 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అలాగే కేరళలో ఏకంగా నాలుగు ఫ్యాన్స్ షోస్ ఫుల్ అయ్యాయట. నోయిడా, పాట్నా, పటేల్ నగర్, ముంబై, ఢిల్లీ, పంజాబ్ వంటి ప్రాంతాలలో కూడా ఈ సినిమాకి స్పెషల్ పడుతున్నాయి అంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఈ ప్రాంతాల నుండే ఈ చిత్రానికి 20 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందట. ఇది సాధారణమైన విషయం కాదు, ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన చిత్రాలకు కనీసం 5 లక్షల రూపాయిలు కూడా రాలేదు. అలాంటిది గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ రేంజ్ వసూళ్లు రావడం చిన్న విషయం కాదు. నార్త్ ఇండియాలో ఎక్కువ శాతం మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పలు విశ్వవిద్యాలయాల్లో చదువుతుండటం వల్ల ఈ సినిమాకి ఇలాంటి డిమాండ్ ఏర్పడింది. అంతే కాదు ఒక్క గుజరాత్ లోనే ఈ చిత్రానికి నాలుగు షోస్ పడుతున్నాయట. ఓవరాల్ గా ఈ చిత్రానికి ఉన్న డిమాండ్ చూస్తుంటే మొదటి రోజు 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అవలీల గా రాబడుతుందని తెలుస్తుంది.
అయితే ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రానికి ఆల్ టైం రికార్డు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రానికి మొదటిరోజు లక్ష డాలర్లు వస్తాయని అనుకున్నారు, కానీ తెలుగు వాళ్ళు, చదువుకునే విద్యార్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో షోస్ అధికంగా లేకపోవడం వల్ల ఈ చిత్రం టాప్ 2 , లేదా టాప్ 3 గ్రాసర్ గా మిగిలే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు కాస్త నిరాశకు కలిగించే వార్త. అయితే ఈ రెండు రోజుల్లో భారీ టిక్కెట్లు అమ్ముడుపోతే కచ్చితంగా ఆల్ టైం రికార్డు పెట్టే అవకాశం ఉంటుంది కానీ, ముందు పెట్టుకున్న లక్ష డాలర్ల టార్గెట్ మాత్రం రీచ్ అవ్వడం కష్టమే.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: There is a huge demand for the re release of gabbar singh in bollywood
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com