Samantha: సమంత అందరి లాంటి అమ్మాయి కాదు. అలాగే భిన్నమైన హీరోయిన్ కూడా. ఆమె ఎంచుకునే పాత్రలు, చిత్రాలు అందుకు నిదర్శనం. స్టార్ హీరోయిన్ గా అనేక కమర్షియల్ చిత్రాల్లో నటించిన సమంత పంథా మార్చారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు అడ్వెంచరస్ సిరీస్లు చేస్తున్నారు. చేసిన పని పదే పదే చేయడం ఆమెకు బోర్ కొడుతుంది అనుకుంటా. ఈ క్రమంలో ఆమె ఎన్టీఆర్ తో నటించే ఆఫర్ కూడా వద్దన్నారట. ఇప్పటికే ఎన్టీఆర్ తో సమంత నాలుగు సార్లు జత కట్టింది. బృందావనం, జనతా గ్యారేజ్, రామయ్య వస్తావయ్యా, రభస చిత్రాల్లో కలిసి నటించారు. ఈ కారణంతో పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ ని సమంత పక్కన పెట్టారు.

కాగా గతంలో ఓ అచ్చిరాని జోనర్ లో సమంత మళ్ళీ నటిస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సమంత తన హిందీ డెబ్యూ మూవీ హారర్ జోనర్ లో చేస్తున్నారట. విషయం ఏమిటంటే సమంత ఆ చిత్రంలో దెయ్యంగా కనిపిస్తారట. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకుడు. సమంత దెయ్యం రోల్ చేస్తున్నారన్న వార్త బాలీవుడ్ తో టాలీవుడ్ లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. కాగా గతంలో సమంత ఈ తరహా రోల్ చేశారు.
Also Read: Samantha Second Marriage: రెండో పెళ్లికి సిద్ధమైన సమంత ?, వరుడు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !
యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజుగారి గది 3 చిత్రంలో సమంత దెయ్యంగా కనిపించారు. మాజీ మామ నాగార్జునతో పాటు సమంత చేసిన ఆ ప్రయోగాత్మక చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. రివేంజ్ తీసుకోవడానికి వచ్చిన దెయ్యంగా సమంత ఆకట్టుకున్నప్పటికీ సినిమా ఫలితం దెబ్బేసింది. హారర్ జోనర్ సమంతకు అచ్చిరాలేదు. ఈ నేపథ్యంలో మరలా సమంత అదే తరహా చిత్రం చేయడం సాహసమే అని చెప్పాలి.

సమంత అందరిలాంటి అమ్మాయి కాదనడానికి ఇదే నిదర్శనం. మరో వైపు హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ సిరీస్ ని హిందీలో సమంత చేస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సిరీస్ కోసమే ఆమె మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారట. ఇక తెలుగులో మూడు ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉన్నాయి. యశోద, శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ రెండు పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానున్నాయి. అలాగే విజయ్ దేవరకొండకు జంటగా ఖుషి చిత్రం చేస్తున్నారు.
Also Read:Upasana: గణేష్ నిమజ్జనంలో బేబీ బంప్ తో కనిపించిన ఉపాసన.. మెగా వారుసుడొస్తున్నాడు.. వైరల్ ఫొటోలు
[…] […]