The Raja Saab: ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘రాజాసాబ్’ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రీసెంట్నా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో ప్రభాస్ ఈ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడారు. అలాగే సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో కొత్త జోష్ నింపారు… ఇప్పటివరకు ప్రభాస్ కెరియర్ లో చేయనటువంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ప్రభాస్ గోస్ట్ గా మారిన తర్వాత ఒక సీన్ అయితే వస్తుందట.
దానికి థియేటర్లలో కూర్చున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు షాక్ అవ్వాల్సిందే అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఆ సీన్లలో ప్రభాస్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట. ‘కాంచన’ సినిమాలో రాఘవ లారెన్స్ దెయ్యం ఆవహించినప్పుడు డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ యాక్టింగ్ చేశాడు. ఇక ప్రభాస్ సైతం ఈ సినిమాలో అంతకుమించిన యాక్టింగ్ ని చూపించబోతున్నాడట…
ముఖ్యంగా దెయ్యం ఆవహించిన తర్వాత వచ్చే ఆ ఒక్క సీను ఈ సినిమాకి హైలైట్ అవ్వబోతుందంటూ అలాగే ఆ సీన్స్ లో ప్రభాస్ యాక్టింగ్ చూసిన ప్రేక్షకులు థియేటర్లను తగలబెట్టేస్తారని సినిమా మేకర్ సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…ఇక రాజాసాబ్ సినిమా ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తోంది. ప్రభాస్ కెరియర్ లో అత్యంత భారీ సక్సెస్ ను కట్టబెడుతుందా మారుతి ఈ దెబ్బతో పాన్ ఇండియాలో స్టార్ హీరోగా కొనసాగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరొక పది రోజులపాటు వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది…
ఇక ఇప్పటివరకు ఎవ్వరు ఎలాంటి గుర్తింపును తెచ్చుకున్నప్పటికీ పాన్ ఇండియాలోకి అడుగుపెట్టిన మొదటి హీరో ప్రభాస్ కావడం విశేషం… అలాంటి ప్రభాస్ మారుతి డైరెక్షన్లో సినిమా చేయడం ఎవరికీ నచ్చకపోయిన కూడా మారుతి ఈ సినిమాని చాలా చక్కగా తెరకెక్కించినట్టుగా ప్రభాస్ ఐతే చెప్పాడు. కాబట్టి ఈ సినిమాతో మరోసారి ప్రభాస్ తన పంజా దెబ్బ ను బాక్సాఫీస్ మీద చూపిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…