Bigg Boss 9 Telugu: మరో 10 రోజుల్లో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ కి విపరీతమైన హైప్, క్రేజ్ ఏర్పడింది. అందుకు కారణం ఈసారి సామాన్యులు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు అనే. అది కూడా ‘అగ్ని పరీక్ష’ అనే షో ద్వారా స్పెషల్ జ్యూరీ మెంబెర్స్ చేత ఎంపికైన కంటెస్టెంట్స్ మాత్రమే. ముగ్గురిని బిగ్ బాస్ హౌస్ లోకి నేరుగా పంపుతారు, మిగిలిన వాళ్లకు పోలింగ్ నిర్వహించి టాప్ 2 ఓటింగ్ వచ్చిన వాళ్ళని పంపుతారు. నిన్నటి వరకు అగ్నిపరీక్ష కి సంబంధించిన మూడు ఎపిసోడ్స్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ మూడు ఎపిసోడ్స్ ద్వారా 6 మంది కంటెస్టెంట్స్ ని టాప్ 15 కి పంపగా, 16 మంది కంటెస్టెంట్స్ ని హోల్డ్ లో పెట్టారు.
Also Read: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు..నార్త్ అమెరికా లో ఫైర్ స్ట్రోమ్!
రేపటి ఎపిసోడ్ నుండి వీళ్ళ మధ్య భీభత్సమైన టాస్కులను నిర్వహించి వీరి నుండి మరో 9 మందిని టాప్ 15 లోకి పంపబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ 9 కి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ప్రతీ బిగ్ బాస్ సీజన్ లో పాల్గొనే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కి రెమ్యూనరేషన్ వారానికి లక్ష నుండి మొదలై నాలుగు లక్షల వరకు ఉంటుందనే విషయం మన అందరికీ తెలిసిందే. ఫేమ్, క్రేజ్ ని బట్టి రెమ్యూనరేషన్ ని ఇస్తుంటారు. అయితే ఈ సీజన్ లో సామాన్యులు రాబోతున్నారు కదా, వాళ్లకు రెమ్యూనరేషన్ ఏ రేంజ్ లో ఉంటుంది అనే సందేహం మీ అందరిలోనూ రావొచ్చు. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సామాన్యులకు వారానికి పాతిక వేల రూపాయిలు రెమ్యూనరేషన్ గా ఇస్తారట.
సామాన్యులకు ఇది మంచి ప్యాకేజీనే కానీ, ఎక్కువ రోజులు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలి, అప్పుడే వీళ్లకు భారీ రెమ్యూనరేషన్స్ ని అందుకునే అవకాశం ఉంటుంది. ఇక బోనస్ గా ప్రైజ్ మనీ కూడా సామాన్యులు గెలిస్తే ఆ కిక్ వేరే లెవెల్ లో ఉంటుంది, ఎంతో మందికి మనం కూడా ఇలా సాధించవచ్చు అనే నమ్మకాన్ని ఇస్తుంది. ఇకపోతే అగ్నిపరీక్ష షో ద్వారా కేవలం 5 మంది సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతున్నారు కానీ, మొత్తం హౌస్ లో సామాన్యుల సంఖ్య 9 , సెలబ్రిటీల సంఖ్య 9 ఉంటుందట. అగ్ని పరీక్ష లో ప్రేక్షకుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించిన ప్రసన్న కుమార్ గుర్తున్నాడా..?, ఈయన టాప్ 15 నుండి వైదొలిగాడు, కానీ ఇతనికి ఎల్లో ఫ్లాగ్ ఇచ్చి పంపారట. అంటే ఇతను హోల్డ్ లో ఉన్నాడని, వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోపలకు వెళ్ళబోతున్నాడని తెలుస్తుంది.