Miss World 2024 Winner : : భారత్ వేదికగా జరుగుతున్న 71 వ మిస్ వరల్డ్ పోటీల్లో చెక్ రిపబ్లిక్ యువతి క్రిష్టినాకు విశ్వసుందరి కిరీటం దక్కింది. హోరాహోరిగా జరిగిన టాప్ – 4 పోటీలో ఆమె చెప్పిన సమాధానాలకు న్యాయ నిర్ణేతలు ఏకీభవించారు. దీంతో ఆమెను విజేతగా ప్రకటించారు. టాప్ -4 లో ఆమె అచ్చే అబ్రహం ట్రిని డాడ్ అండ్ టొబాగో, లేసేగో చొంబో బోట్స్ వానా, యాస్మినా జే టౌన్ లెబనాన్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంది. చివరికి ఆమె విజేతగా నిలిచింది. గత ఏడాది విజేత పోలాండ్ దేశానికి చెందిన కరోలినా బిలావాస్కా నుంచి కిరీటం అందుకుంది.
కిరీటం అందుకున్న తర్వాత చెక్ రిపబ్లిక్ యువతి క్రిష్టినా భావోద్వేగానికి గురైంది. దీ మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్ ఇస్.. అని జడ్జీలు ఆమె పేరు ప్రకటించగానే కన్నీటి పర్యంతమైంది. వేదిక ముందు ఉన్న జడ్జిలకు చేతులతో నమస్కరించింది. రెండు చేతులను కిందకు వంచి కన్నీటితో ప్రణమిల్లింది. క్రిష్టినా మిస్ వరల్డ్ కిరీటం సాధించడంతో చెక్ రిపబ్లిక్ లో సంబరాలు మిన్నంటాయి. సామాజిక మాధ్యమాలలో క్రిష్టినా పేరు మార్మోగిపోతుంది. ఈ పోటీలలో భారత్ కు చెందిన సినీ శెట్టి టాప్ – 4 లోనే వెనుదిరిగింది.
క్రిష్టినా అందమైన యువతి మాత్రమే కాదు.. అంతకుమించిన సేవ తత్పరురాలు కూడా.. క్రిష్టినా టాంజానియాలోని ఓ పాఠశాలలో ప్రారంభించింది. అక్కడ పిల్లలకు నాణ్యమైన విద్యను బోధిస్తోంది. స్వచ్ఛంద సేవకురాలి గానూ పనిచేస్తోంది. తన సొంత దేశమైన చెక్ రిపబ్లిక్ లో వృద్ధులు, మానసిక వికలాంగులకు చేయూతనందించే కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకోవడంతో.. త్వరలో ఆ పని చేస్తానని ఆమె ప్రకటించింది.