Bigg Boss 7 Telugu Elimination: షాకింగ్ ఓటింగ్ 40% ఓట్లు ఒకరికే… హౌస్ నుండి ఆ కంటెస్టెంట్ ఔట్?

గత ఏడు సీజన్స్ లో ఇది అత్యల్పం. బిగ్ బాస్ తెలుగులో అత్యల్పంగా 19 మంది అత్యధికంగా 21 మంది కంటెస్టెంట్ మొదటిరోజు హౌస్లోకి వెళ్లారు.

Written By: Shiva, Updated On : September 9, 2023 9:31 am

Bigg Boss 7 Telugu Elimination

Follow us on

Bigg Boss 7 Telugu Elimination: బిగ్ బాస్ తెలుగు 7 మొదటి వారానికి గానూ ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. 8 మంది నామినేషన్స్ లో ఉండగా ఓటింగ్ లో వెనుకబడ్డ ఆ కంటెస్టెంట్ ఇంటిని వీడనుంది. సెప్టెంబర్ 3న బిగ్ బాస్ తెలుగు 7 అట్టహాసంగా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున వరుసగా ఐదో సీజన్ కి హోస్ట్ బాధ్యతలు తీసుకున్నారు. ఒక్కో కంటెస్టెంట్ ని స్వయంగా పరిచయం చేసి ఇంట్లోకి పంపాడు. అయితే ఈసారి కేవలం 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే పాల్గొన్నారు.

గత ఏడు సీజన్స్ లో ఇది అత్యల్పం. బిగ్ బాస్ తెలుగులో అత్యల్పంగా 19 మంది అత్యధికంగా 21 మంది కంటెస్టెంట్ మొదటిరోజు హౌస్లోకి వెళ్లారు. ఈసారి కేవలం 14 మంది పాల్గొనడం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. చివరి నిమిషంలో కొందరు తప్పుకున్నారని సమాచారం. అలాగే కొందరు కంటెస్టెంట్స్ త్వరలో హౌస్లోకి రానున్నారట.

ఇక నామినేషన్స్ లో రతికా రోజ్, పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, దామిని, కిరణ్ రాథోడ్, షకీలా, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్ ఉన్నారు. మంగళవారం రాత్రి నుండి ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. అనూహ్యంగా ఓటింగ్ లో 40% ఓట్లు ఒక్క కంటెస్టెంట్ కే పడ్డాయని సమాచారం. అది కూడా కామనర్ హోదాలో హౌస్లో అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కి. పల్లవి ప్రశాంత్ గురించి ఎవరికీ తెలియదు. అతడు సెలెబ్రిటీ కూడా కాదు. అయినా ప్రేక్షకులు అతడిపై ప్రేమ కుమ్మరిస్తున్నారు.

పల్లవి ప్రశాంత్ తర్వాత రెండో స్థానంలో రతికా రోజ్ ఉందట. శోభా శెట్టి మూడో స్థానం, గౌతమ్ కృష్ణ నాలుగో స్థానంలో ఉన్నారట. షకీలా, ప్రిన్స్ యావర్ ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారట. ఇక దామిని ఏడవ స్థానంలో, కిరణ్ రాథోడ్ ఎనిమిదవ స్థానంలో ఉన్నారట. కాబట్టి ఓటింగ్ సరళి ప్రకారం ఈ ఆదివారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కానుంది. అయితే మొదటివారం ఎలిమినేషన్ ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం. చూడాలి మరి ఏం జరుగుతుందో…