Vikatakavi web series : తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ చాలా మంది దర్శకులు కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలను తెరకెక్కిస్తూ మంచి విజయాలను సాధిస్తున్నారు. ఇక ఇప్పటివరకు చేసిన ప్రతి ఒక్క దర్శకుడు తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్ళడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా ఏదో ఒక కొత్త అనుభూతిని అయితే ఇస్తుంది. ఇక ఈ క్రమంలోనే జి 5 లో స్ట్రీమింగ్ అవుతున్న వికటకవి సిరీస్ 100 బిలియన్ మినిట్స్ వ్యూస్ ని కంప్లీట్ చేసుకుంది. ఇక నరేష్ అగస్త్య, మెగా ఆకాష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకులను అలరించడమే కాకుండా ప్రతి ఒక్క ఆడియన్ ను అట్రాక్ట్ చేస్తుంది. ఇక దానికోసమే ప్రేక్షకులందరికీ ఈ సిరీస్ ప్రొడ్యూసర్ అయిన రామ్ తాళ్లూరి కృతజ్ఞతలను తెలియజేశాడు. ఇక దర్శకుడు ప్రదీప్ మద్దాలి ఈ సినిమాను చాలా బాగా తెరకెక్కించాడు అంటూ ప్రశంసలనైతే అందుకుంటున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సిరీస్ డిటెక్టివ్ నేపధ్యంలో రావడమే కాకుండా తెలంగాణ స్లాగ్ ను యాడ్ చేస్తూ దీన్ని ఒక వినుత్న ప్రయత్నంగా చిత్రీకరించారు.
ఇక మొత్తానికైతే ఈ సినిమా తో మరోసారి మంచి సక్సెస్ ని అందుకున్నాడు. అలాగే ప్రదీప్ మద్దాలి తన దర్శకత్వ ప్రతిభను బయటకు తీశాడు…ఇక మొత్తానికైతే వాళ్లు పడిన కష్టానికి ఒక మంచి ప్రతిఫలం అయితే దక్కింది. మరి ఈ సిరీస్ ను ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే జి 5 లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా ఈ సిరీస్ ను చూడండి.
ఇది ఒక బెస్ట్ అటెంప్ట్ గా మిగిలిపోవడమే కాకుండా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తూ చాలా ట్విస్ట్ లతో త్రిల్ ఫీల్ ఇస్తుంది. మరి ఇప్పటికే మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు వస్తున్నప్పటికి ఓటిటి ప్లాట్ ఫామ్ లో తెలుగు సిరీస్ లకు కూడా చాలా మంచి గుర్తింపైతే లభిస్తుంది.
ఇక అందులో భాగంగానే నరేష్ అగస్త్య చేస్తున్న ప్రతి సిరీస్ కూడా థ్రిల్లర్ జానర్ లోనే సాగుతూ ఉండటం విశేషం…మరి ఈ సిరీస్ ప్రస్తుతానికైతే 100 మిలియన్ మినిట్స్ వ్యూస్ ని సొంతం చేసుకొని ముందుకు దూసుకెళ్తుంది. ఇక లాంగ్ రన్ లో ఎంతటి వ్యూస్ ని సంపాదించుకుంటుందనేది తెలియాల్సి ఉంది..