Manchu Lakshmi : ఒక్క వీడియో.. మంచు లక్ష్మీ మీద పడిపోయిన ట్రోలర్స్

మంచు లక్ష్మి మాత్రం లాప్ టాప్ లో ఆ వీడియోని చూస్తూ దేవుడి విగ్రహం కనిపించినప్పుడు లాప్ టాప్ మీదనే పూలు వేస్తూ పూజ చేస్తుంది. అలాగే దీన్ని వీడియో తీసి ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేసింది.

Written By: Gopi, Updated On : January 24, 2024 10:12 pm

Manchu Lakshmi Pujas on Laptop

Follow us on

Manchu Lakshmi : సినిమా ఇండస్ట్రీలో కొంతమంది సినిమాలు చేస్తూ ఫేమస్ అవుతూ ఉంటే, మరి కొంతమంది మాత్రం ఏదో ఒక తింగరి పని చేసి ట్రోలర్స్ చేతిలో ట్రోల్ అవుతూ ఎప్పుడు జనాల నోట్లో నానుతూ ఉండాలని చూస్తు ఉంటారు. ఇక అలాంటి వాళ్లలో మంచు ఫ్యామిలీ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ మధ్య కొంచెం తగ్గింది కానీ ఇంతకు ముందు మంచు ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడ ఏం మాట్లాడినా కూడా ట్రోలర్స్ విపరీతంగా ట్రోలింగ్ చేస్తూ ఉండేవారు.

ఒకానొక సందర్భంలో ట్రోలర్స్ కి భయపడి వాళ్ళు అసలు మాట్లాడటం కూడా మానేశారనే చెప్పాలి. ఇక మళ్లీ చాలా రోజుల తర్వాత మంచు లక్ష్మి మరోసారి ట్రోలింగ్ కి గురి అవుతుంది. ఆమె ఎందుకు ట్రోల్ అవుతుంది అంటే అయోధ్య లోని రామ మందిరంలో రాముడి కి పూజలు చేస్తుంటే మంచు లక్ష్మి మాత్రం లాప్ టాప్ లో ఆ వీడియోని చూస్తూ దేవుడి విగ్రహం కనిపించినప్పుడు లాప్ టాప్ మీదనే పూలు వేస్తూ పూజ చేస్తుంది. అలాగే దీన్ని వీడియో తీసి ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేసింది.

ఇక ఆ వీడియో చూసిన ట్రోలర్స్ మంచు లక్ష్మి ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె పోస్ట్ చేసిన వీడియోకి విపరీతమైన కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇక అందులో కొందరు నువ్వు అయోధ్య కి వెళ్లే ఖర్చులు తగ్గించావు అక్క ఇక్కడుండే డైరెక్ట్ గా దేవుడికి పూజ చేసుకుంటున్నావంటు కామెంట్లు చేయగా, మరి కొంతమంది మాత్రం మీ మంచు ఫ్యామిలీ ఇక మారారు, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ వీడియో చూసిన కొంత మంది సినీ పండితులు సైతం మంచు ఫ్యామిలీ వాళ్ళు కావాలనే ఇలా చేస్తారో లేదంటే జనం ముందు అతి చూపించాలని చేస్తారో తెలియదు కానీ వాళ్ళు ఏదో ఒక రకంగా ట్రొల్ కి గురయ్యేంత వరకు వాళ్ళకి నిద్ర పట్టదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మొత్తానికైతే మొన్నటిదాకా మంచు ఫ్యామిలీని ట్రోలింగ్ చేయడం ఆపేసిన ట్రోలర్స్ కి మంచు లక్ష్మి ఇప్పుడు మళ్లీ ఒక కొత్త బూస్టప్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక ఈ వీడియో తో ట్రోలర్స్ చెలరేగిపోతున్నారనే చెప్పాలి…