The Vaccine War Trailer: కరోనా ఆధునిక ప్రపంచం చూడని భయాన్ని పరిచయం చేసింది. అసలు మానవ జాతి అంతం కానుందా అనే సందేహాలు కలిగాయి. దేశానికి దేశానికి, రాష్ట్రానికి రాష్ట్రానికి, గ్రామానికి గ్రామానికి, ఇంటికి ఇంటికి, మనిషికి మనిషికీ దూరం పెంచిన వైరస్ కోవిడ్ 19. ఊళ్లు అడవులైపోయాయి. స్మశానాలు శవాలతో నిండిపోయాయి. 2020-21 సంవత్సరాల్లో కరోనా లక్షల మందిని బలితీసుకుంది. కరోనాను అదుపు చేసే మందు కోసం ప్రపంచ దేశాలు పరుగులు పెట్టాయి. అనూహ్యంగా ఇండియానే కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసింది.
ఈ వాస్తవ సంఘటనల ఆహారంగా ది వ్యాక్సిన్ వార్ మూవీ తెరకెక్కింది. ది కాశ్మీర్ ఫైల్స్ ఫేమ్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు. నానా పటేకర్, పల్లవి జోషి ప్రధాన పాత్రలు చేశారు. ది వ్యాక్సిన్ వార్ మూవీ విడుదలకు సిద్ధం కాగా ట్రైలర్ విడుదల చేశారు. దేశంలో ఏర్పడిన దుర్భర పరిస్థితులు, వ్యాక్సిన్ ఆవశ్యకత, దాన్ని రూపొందించటానికి నానా పటేకర్ ఆధ్వర్యంలో పని చేసిన సైంటిస్ట్స్ పడ్డ స్ట్రగుల్స్… ప్రధానంగా తెరకెక్కింది.
ఇక ది వ్యాక్సిన్ వార్ మూవీలో పొలిటికల్ కంటెంట్ కూడా ఉండే అవకాశం ఉంది. వివేక్ అంటేనే ప్రోపగండా లేకుండా సబ్జక్ట్స్ ఎంచుకోరు అనే పేరుంది. బీజేపీ ప్రభుత్వం కరోనా వంటి క్లిష్ట పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొంది. వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచానికి ఇచ్చింది అని చెప్పే ప్రయత్నం కూడా కావచ్చు. మోడీ ఇమేజ్ పెంచే, ప్రతిపక్షాల ఇమేజ్ తగ్గించే సన్నివేశాలు ఖచ్చితంగా ఉంటాయని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.
ఇక సెప్టెంబర్ 28న ది వ్యాక్సిన్ వార్ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంతో ప్రభాస్ సలార్ చిత్రాన్ని దెబ్బతీస్తానని దర్శకుడు వివేక్ గతంలో సన్నిహితుల వద్ద ఛాలెంజ్ చేశాడని సమాచారం. ది కాశ్మీర్ ఫైల్స్ దెబ్బకు రాధే శ్యామ్ పోయింది. ది వ్యాక్సిన్ వార్ తో సలార్ పోతుందని అన్నాడట. అయితే వివేక్ కోరిక నెరవేరలేదు. సలార్ మూవీ విడుదల వెన్నక్కు పోయిన విషయం తెలిసిందే.
