The Vaccine War Collection: వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం లో వచ్చిన ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఆయన ది వ్యాక్సిన్ వార్ అనే సినిమాని రూపొందించాడు. ఈ సినిమా బడ్జెట్ 25 కోట్లు కాగా ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ మాత్రం భారీ రేంజ్ లో జరిగింది.35 కోట్ల ప్రి రిలీజ్ జరుపుకొని ఈ సినిమా తన సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకుంది…ఇక కాశ్మీర్ ఫైల్స్ సినిమా మంచి విజయం సాధించడం తో ఈ సినిమా కూడా భారీ రేంజ్ లో బిజినెస్ సాధించిందనే విషయం అందరికి తెలిసిందే…
ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28 వ తేదీన రిలీజ్ అయింది ఇక దానికి తోడు గా ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని అని అందరూ అనుకున్నారు కానీ అందరి ఊహలను తల కిందులు చేస్తూ ఈ సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే మేకర్స్ కి భారీ షాక్ ఇచ్చింది…ఈ సినిమాను ఇండియాలోనే 1000 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు… అయినప్పటికీ ఈ సినిమా లో పెద్దగా మ్యాటర్ లేదు అంటూ చాలా మంది సినీ విమర్శకులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా కలక్షన్స్ కూడా అలానే ఉన్నాయి…
ది కశ్మీర్ ఫైల్స్ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి మొదటి రోజు 3 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించి మంచి సక్సెస్ ని సాధించే దిశ గా దూసుకుపోయింది.కానీ ఈ సినిమా మాత్రం మొదటి రోజు 80 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇక దానికి తోడు ఈ సినిమా మీద నెగిటివ్ కామెంట్లు రావడం కూడా జరిగింది.ఇక రెండో రోజు 65 లక్షలు రాబట్టింది…మూడో రోజు హాలిడే ఉండటం వల్ల ఈ సినిమా కి బాగా కలిసి వచ్చింది అందుకే ఆ రోజు ఏకం గా 1 కోటి రూపాయలు వసూలు చేసింది.ఇక నాలుగో రోజు 1.55 కోట్లు, ఐదో రోజు 1.5 కోట్లు వసూలు చేసింది. ఇక ఆరో రోజు 50 లక్షలు మాత్రమే కలెక్షన్స్ ని రాబట్టి మరోరోజు కూడా తన స్టామినా ని చూపించలేక పోయింది…ఇక దాంతో 1000 థియేటర్లలో రిలీజ్ చేసిన ఈ సినిమా ని రెండో వారం చాలా థియేటర్లలో నుంచి తీసివేస్తున్నట్లు గా తెలుస్తుంది…ఈ డైరెక్టర్ అప్పట్లో మన తెలుగు హీరో అయిన ప్రభాస్ మీద చాలా కామెంట్లు చేశాడు. ఇక దానికి తగ్గట్టు గానే సలార్ సినిమా మీద కూడా చాలా నెగిటివ్ కామెంట్లు చేశాడు ఇక దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమా కి నెగిటివ్ టాక్ రావడం తో సంతోష పడుతున్నారు…