Niharika Konidela: మెగా డాటర్ నిహారిక గురించి సినీ ప్రేక్షకులకు తెలియని వారు ఉండరు. యాంకర్ గా ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత పెద్దనాన్న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’లో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించింది. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే నిహారిక చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే వీరిద్దరు ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు.కొన్ని నెలల కిందట ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్నారు. అయితే నిహారిక మాజీ భర్తను మరిచిపోవడానికి ఓ పని చేస్తోందట. అదేంటంటే?
నిహారిక ఫొటోస్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె వెకేషన్ కోసం ఆఫ్రికా వెళ్లిందని, ఆ తరువాత అమెరికాకు వెళ్లిందన్న వార్తలు వస్తున్నాయి. విడాకులు తీసుకున్న తరువాత నిహారిక గురించి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ చేశారు. వాటి ధాటికి తట్టుకోలేక మనసు ప్రశాంతంగా ఉండడానికి విదేశాలకు వెళ్లిందని తెలుస్తోంది. ఇటీవల నాగబాబు ఇంట్లో వినాయక చవితి పూజ సందర్భంగా కాబోయే కోడలు లావణ్య త్రిపాఠి కనిపించింది. కానీ నిహారిక లేకపోవడంతో పలు రకాలుగా చర్చలు సాగాయి.
విడాకులు తీసుకున్న తరువాత చైతన్య జొన్నలగడ్డ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఆయన అధికారికంగా ప్రకటించలేదు. ఇటు నిహారిక కూడా సినీ హీరోలతో వివాహం చేసుకుంటుందని అన్నారు.కానీ అదంతా నిజం కాదని తెలిసిపోయింది. ప్రస్తుతం ఆమె కొన్నాళ్ల పాటు ఒంటరిగా జీవించాలని నిర్ణయించుకుందట. అందుకే లోకల్ గా కాకుండా విదేశాలకు వెళ్లిందని అంటున్నారు.
ఈ తరుణంతో తనకు మాజీ భర్త చైతన్య పదే పదే గుర్తుకు రాకుండా ఉండడానికి ఓ కుక్కను పెంచుకుంటోందట. ఎటు వెళ్లినా తనవెంట ఆ కుక్కను తీసుకెళ్తుందట. వాస్తవానికి నిహారిక కు కుక్కను పెంచుకోవాలని లేదట. కానీ తనకు తోడుగా ఉండడానికి శునకాన్ని ఎంచుకుందట. కుక్కలైతే విశ్వాసాన్ని కలిగి ఉంటాయని, వాటితో ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని భావించి నిహారిక ఈ పని చేసిందనికొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.