Photo Story: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ కావాలంటే ఎంతో కొంత సపోర్టు ఉండాలని కొందరు భావిస్తారు. ఇప్పుడున్న వాళ్లలో గాడ్ ఫాదర్ సహాయంతో ఎంతో పరిశ్రమలో కొనసాగుతున్నారు. అయితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వయం శక్తితో ఇండస్ట్రీలో ఎదిగిన ఈతరం వారిలో ముందుగా మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పుకుంటాం. ఎలాంటి అండదండా లేకున్నా చిరంజీవి సినిమాలో విజేతగా నిలిచారు. ఆయన ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అచ్చం వీరిలాగే మరో ఇద్దరు అన్నదమ్ములు ఎలాంట గాడ్ ఫాదర్ లేకుండా టాలీవుడ్ పరిశ్రమలో స్టార్లు అయ్యారు. వారికి సంబంధించిన చిన్న నాటి ఫొటో అలరిస్తోంద. ఇంతకీ వారెవరో చూద్దామా..
పై ఫొటోలని ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు విజయ్ దేవరకొండ, మరొకరు ఆనంద్ దేవకొండ. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దేవరకొండ గోవర్ధన్ రావు, మాధవిలకు వీరు జన్మించారు. విజయ్ పుట్టకముందే ఈ కుటుంబం హైదరాబాద్ కు వచ్చింది. విజయ్ చదువంతా హైదరాబాద్ లోని సాగింది. సినిమాలపై ఆసక్తి ఉన్న విజయ్ ముందుగా డైరెక్టర్ కావాలని కలలు కనేవాడు. అయితే ఆ అవకాశాలు రాకపోవడంత రవిబాబు తీసిన ‘నువ్విలా’లో చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది. ఆ తరువాత శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’లో నటించారు. ఇక తరుణ్ భాస్కర్ చిత్రం ‘పెళ్లి చూపులు’ సినిమాతో విజయ్ అందరికీ పరిచయం అయ్యాడు.
విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సోదరుని సహాయంతో ఇండస్ట్రీకి వచ్చినా..సొంత ప్రతిభనే నమ్ముకున్నాడు. అమెరిరికాలోని డెలాయిట్ కంపెనీలో పనిచేసిన ఆనంద్ దేరకొండ సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో జాబ్ మానేశాడు. ‘దొరసాని’ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు. మొదట్లో ఆనంద్ నటించిన సినిమాలు సక్సెస్ కాకపోవడంతో విజయ్ లా స్టార్ అవుతారో లేదో అనుకున్నారు. కానీ హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చేసుకుంటూ పోయారు. లేటేస్టుగా ‘బేబీ’తో అలరించాడు.
ఇక ఇటీవల బేబీ సక్సెస్ ఫంక్షన్ కు విజయ్ దేవరకొండ గెస్టు గా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనంద్ ఫ్యూచర్లో స్టార్ అవుతారని ఆకాంక్షించారు. అన్నదమ్ములు ఇండస్ట్రీలోకి రావడం పెద్ద విషయం కాదు. కానీ ఇద్దరూ సక్సెస్ అవుతారని ఎవరూ ఊహించారు. దేవరకొండ సోదరులు మాత్రం ఎవరికి వారు స్టార్లుగా ఎదిగేందుకు తీవ్రంగా కృష్టి చేశారు. ఇప్పుడు వారితో సినిమాలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారని ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది.