Project K: ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కే. దర్శకుడు నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. విడుదలకు ముందే ప్రాజెక్ట్ కే అరుదైన గౌరవం అందుకుంది. శాన్ డియాగో కామిక్ కామ్ 2023లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ఈ అంతర్జాతీయ సినిమా వేడుకలో పాల్గొన్న ఫస్ట్ ఇండియన్ మూవీగా ప్రాజెక్ట్ కే రికార్డులకు ఎక్కింది. శాన్ డియాగో కామిక్ కామ్ జులై 20 నుండి 23వరకు జరగనుంది. ప్రాజెక్ట్ కే తరపున హీరో ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, నాగ్ అశ్విన్ పాల్గొననున్నారని ప్రకటించారు.
నిన్ననే ప్రాజెక్ట్ కే యూనిట్ అమెరికాలో అడుగుపెట్టారు. ప్రభాస్ తో పాటు రానా ఉన్నారు. ప్రాజెక్ట్ కేలో రానా నటించడం లేదు. అయినా రానా కూడా శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో పాల్గొననున్నారు. దీంతో రానా సైతం ప్రాజెక్ట్ కే లో భాగమయ్యారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. అలాగే కమల్ హాసన్ కూడా అమెరికా చేరుకున్నారు. ఆయన ఫోటో యూనిట్ రివీల్ చేశారు.
శాన్ డియాగో కామిక్ కామ్ వేదికగా ప్రాజెక్ట్ కే టైటిల్ అండ్ టీజర్ విడుదల చేస్తున్నారు. జులై 20న టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ కానున్నాయి. భారత కాలమానం ప్రకారం జులై 21న ఇండియన్ ఆడియన్స్ వీక్షించనున్నారు. ప్రాజెక్ట్ కే చిత్ర టైటిల్ ఇదే అంటూ కొన్ని ప్రచారంలో ఉన్నాయి. మరో రెండు రోజుల్లో పూర్తి క్లారిటీ రానుంది. ప్రాజెక్ట్ కే టీజర్ పై ఫ్యాన్స్ లో ఉత్కంఠ నెలకొంది.
దాదాపు రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో ప్రాజెక్ట్ కే తెరకెక్కుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. అశ్వినీ దత్ ఈ చిత్ర నిర్మాత. కమల్ హాసన్ కీలక రోల్ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ప్రాజెక్ట్ కే చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని సమాచారం. పార్ట్ 2 లో కమల్-ప్రభాస్ మధ్య ప్రధాన సంఘర్షణ ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. దీపికా పదుకొనె హీరోయిన్. అమితాబ్, దిశా పటాని సైతం కీలక రోల్స్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ కే 2024 జనవరి 12న విడుదల కానుంది.
https://twitter.com/VyjayanthiFilms/status/1681265055189585925