https://oktelugu.com/

Sathyaraj: కట్టప్ప జీవితంలో ఊహించని విషాదం, గుండెలు బరువెక్కించే వార్త

సత్యరాజ్ అలియాస్ కట్టప్ప జీవితంలో ఉన్న విషాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన కూతురు దివ్య సోషల్ మీడియా వేదికగా ఈ విషయం వెల్లడించారు. దివ్య సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. ఇంతకీ సత్యరాజ్ జీవితంలో చోటు చేసుకున్న విషాదం ఏమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : November 12, 2024 / 05:36 PM IST

    Sathyara

    Follow us on

    Sathyaraj: సత్యరాజ్ సీనియర్ కోలీవుడ్ యాక్టర్. కెరీర్ బిగినింగ్ లో హీరోగా కూడా చేశాడు. తెలుగులో ఆయనకు బాహుబలి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. బాహుబలి, బాహుబలి 2 ఇండియా వైడ్ భారీ వసూళ్లు సాధించిన చిత్రాలుగా ఉన్నాయి. దాంతో ఇతర భాషల్లో కూడా సత్యరాజ్ ఫేమస్ అయ్యాడు. ఆయన్ని కట్టప్ప గానే ఈ దేశంలోని ఆడియన్స్ గుర్తిస్తారు. అంతగా బాహుబలి సిరీస్లో ఆయన పాత్ర ప్రాచుర్యం పొందింది.

    తెలుగులో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సత్యరాజ్ వెలుగొందుతున్నారు. దశాబ్దకాలంగా ఆయనకు తిరుగులేదు. అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. కామెడీ పాత్రలను కూడా ఆయన అద్భుతంగా పండిస్తారు. విలక్షణ నటుడిగా పేరున్న సత్యరాజ్ వ్యక్తిగత జీవితంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన గుండెల్లో కొండంత బాధ ఉంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సత్యరాజ్ భార్య అనారోగ్యంతో బాధపడుతున్నారట. ఆమె గత నాలుగేళ్లుగా కోమాలో ఉన్నారట.

    ఈ విషయాన్ని సత్యరాజ్ కుమార్తె దివ్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మా అమ్మగారు నాలుగేళ్లుగా కోమాలో ఉన్నారు. ఆమెకు PEG ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నాము. మేము దిగ్భ్రాంతికి గురయ్యాము. ఆమె కోలుకుంటుంది అనే ఆశ మాకు ఉంది. ఏదో ఒకరోజు సాధారణ స్థితికి అమ్మ వస్తుంది. నాన్న అన్నీ తానై మమ్మల్ని చూసుకుంటున్నారు. ఆయన గొప్ప సింగిల్ పేరెంట్.. అంటూ దివ్య రాసుకొచ్చింది. దివ్య సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది.

    మహేశ్వరి అనే మహిళను సత్యరాజ్ 1979లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. అబ్బాయి పేరు శిబిరాజ్, కూతురు దివ్య. శిబిరాజ్ హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. పలు చిత్రాల్లో నటించాడు. ఇక సత్యరాజ్ తెలుగు, తమిళ భాషల్లో అధికంగా చిత్రాలు చేస్తున్నారు. ఇతర భాషల్లో కూడా ఆయన సినిమాలు చేస్తున్నారు.