Ram Charan: భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం అభిమానులను తీవ్ర స్థాయిలో నిరాశకి గురి చేసిన సంగతి తెలిసిందే. విడుదలకు ముందు ఈ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, తమ హీరో కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సినిమా పేరు చెప్తేనే భయపడిపోతున్నారు. అంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. కలెక్షన్స్ పరంగా ఈ సినిమా 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, వంద కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. కానీ బ్రేక్ ఈవెన్ కి అవి ఏమాత్రం సరిపోవు. ఫుల్ రన్ లో 450 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు సాధిస్తేనే ఇది సూపర్ హిట్ అయ్యినట్టు లెక్క. ఇప్పటి వరకు కనీసం 50 శాతం రికవరీ ని కూడా చేయలేకపోయింది ఈ చిత్రం.
ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చి బాబు దర్శకత్వం లో రంగస్థలం తరహా రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకున్న ఈ చిత్రం, రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. మూడవ షెడ్యూల్ ఈ నెల 27 న హైదరాబాద్ లో మొదలు కానుంది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ కూడా పాల్గొనబోతున్నాడు. అయితే ఈ చిత్రానికి టైటిల్ గా ‘పెద్ది’ ని ఖరారు చేసినట్టు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ కి కూడా ఈ టైటిల్ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. కానీ ఎందుకో టైటిల్ లో పవర్ మిస్ అయ్యిందని, ఇది రామ్ చరణ్ మాస్ ఇమేజ్ కి సరిపడా టైటిల్ కాదని, వేరే టైటిల్ ని చూడాలంటూ కొంతమంది అభిమానులు సోషల్ మీడియా లో సలహాలు ఇస్తున్నారు.
అయితే ‘రంగస్థలం’ టైటిల్ ని ప్రకటించినప్పుడు కూడా ఇలాగే అన్నారని, కానీ ఆ టైటిల్ తో వచ్చిన ఆ చిత్రం కమర్షియల్ గా ఎలాంటి సునామీ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదని, పెద్ది అనే టైటిల్ కూడా కథ కి తగ్గట్టుగా ఉంటుందని, కాబట్టి అభిమానులు అసలు కంగారు పడాల్సిన అవసరమే లేదంటూ సోషల్ మీడియా లో మరికొంతమంది అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ వివిధ ఆటల్లో ప్రావిణ్యం ఉన్న యువకుడిగా కనిపిస్తాడని, ఆయన పాత్ర సినిమాలో చాలా ఎమోషనల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. రామ్ చరణ్ కి ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ తగిలినప్పుడు చెలరేగిపోతాడు అనే విషయం అందరికీ తెలిసిందే. కచ్చితంగా ఈ చిత్రంతో ఆయన నేషనల్ అవార్డుని సొంతం చేసుకుంటాడని అంటున్నారు.