https://oktelugu.com/

MARUTHI: నుంచి రిలీజ్ అయిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఎలా ఉందో తెలుసా.. ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే

భారతదేశంలో మారుతీ కార్లకు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఇప్పటికే ఎన్నో మోడళ్ళు చాలామంది వినియోగదారులు దక్కించుకున్నారు.

Written By: , Updated On : January 21, 2025 / 05:18 PM IST
New-Car-from-Maruthi

New-Car-from-Maruthi

Follow us on

MARUTHI: భారతదేశంలో మారుతీ కార్లకు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఇప్పటికే ఎన్నో మోడళ్ళు చాలామంది వినియోగదారులు దక్కించుకున్నారు. అయితే మారుతి నుంచి ఎలక్ట్రిక్ కారు ఎప్పుడు వస్తుందా..?అని చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఢిల్లీలో జరుగుతున్న ఆటో మొబిలిటీ షో లో మారుతి కంపెనీ సరికొత్త EVని ప్రవేశపెట్టింది. మారుతి కంపెనీ నుంచి రిలీజ్ అయిన మొట్టమొదటి SUV గ్రాండ్ విటారా. ఇది ఇప్పుడు మొదటి ఎలక్ట్రిక్ కారుగా కూడా అవతారం ఎత్తింది. దీని డిజైన్, ఫీచర్స్ చూసి వినియోగదారులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మరి ఈ కారు ఎలా ఉందో తెలుసుకుందామా..? అయితే వివరాల్లోకి వెళ్ళండి..

భారతీయ ఆటో మొబైల్ మార్కెట్లో మారుతి కంపెనీకి తిరుగులేదు అని అంటుంటారు. ఎందుకంటే ఇప్పటివరకు సెడాన్, ఎస్ యు వి వేరియంట్లలో దిగ్గజ కారులను ఈ కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంట్లలో కూడా తన సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా తాజాగా మారుతి ఈ- విటారా ను అధికారికంగా ఆవిష్కరించింది. ఇప్పటికే అద్భుతమైన బూట్ స్పేస్ ను కలిగిన విటారా ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంట్ తో అందుబాటులోకి రావడంతో వినియోగదారులు ఇంప్రెస్ అవుతున్నారు.

ఈ మోడల్ ఫీచర్స్ విషయానికొస్తే.. ఇన్నర్లో 10.1 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ను అమర్చారు. అలాగే 10.25 అంగుళాల ఇన్స్ట్రుమెంటల్ డిస్ప్లేను కలిగి ఉంది. మల్టీ ఫంక్షన్ హాల్ తో పాటు స్పోర్ట్స్ స్టీరింగ్ తో డ్రైవర్ కు అనుకూలంగా ఉంటుంది. అలాగే సేఫ్టీ విషయంలోనూ ఈ కారు తగ్గేదేలే అని నిరూపిస్తుంది. ఎందుకంటే ఇందులో 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ seats కలవు. ఎక్స్టీరియర్ లో ఈ కారుకు పెద్ద టైర్లను అమర్చారు. ఇవి లాంగ్ వీల్ బేస్ ను కలిగి ఉన్నాయి. దీంతో ఇవి దృఢత్వాన్ని కలిగి ఉంటాయని చర్చించుకుంటున్నారు.

మారుతి నుంచి రిలీజ్ అయ్యే మొదటి ఎలక్ట్రిక్ కార్ అయినందున దీని సేఫ్టీ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇందులో అడ్వాన్సుడ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టం షూట్ ను అమర్చారు. అలాగే లెవెల్ టు అడాస్ టెన్ వే, పవర్ అడ్జస్టేబుల్ డ్రైవర్ షీట్ను చేర్చారు.

ఇక ఈ కారులో 49 కిలో వాట్ లేదా 61 కిలో వాట్ బ్యాటరీ పాక్ కలిగి ఉంది. ఇవి 142 Bhp పవర్ ను అందిస్తాయి. అలాగే 192nm టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ బ్యాటరీ ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో ఈ వీలు వచ్చినా మారుతి నుంచి వచ్చిన మొదటి ఈవీ ఇదే. దీంతో ఈ మోడల్ సక్సెస్ కావడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు కంపెనీ చెబుతోంది. ఎస్ యు వి సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ వేరియంట్ గా వచ్చిన కారురు వినియోగదారులను ఎలా ఆకట్టు ఉంటుందో చూడాలి.