Titanic Heroine – Ram Charan: గత ఏడాది విడుదలైన #RRR సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరల్డ్ వైడ్ గా ఎలాంటి గుర్తింపు తెచుకున్నాడో మన అందరికి తెలిసిందే..విదేశీయులు కూడా రామ్ చరణ్ నటనకి ఫ్లాట్ అయ్యారు.. రంగస్థలం వంటి భారీ సెన్సేషనల్ హిట్ తర్వాత రామ్ చరణ్ మరోసారి తన అద్భుతమైన నటన కనబర్చాడు..సినిమా విడుదలప్పుడు కూడా రామ్ చరణ్ నటనకే ఎక్కువ ప్రశంసలు వచ్చాయి..డిఫరెంట్ షేడ్స్ తో ఆయన అదరగొట్టేసాడు.

ఇప్పుడు #RRR చిత్రానికి గ్లోబల్ వైడ్ గా ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వస్తున్న నేపథ్యం లో రామ్ చరణ్ కి కూడా మంచి గుర్తింపు లభిస్తుంది..రీసెంట్ గా లాస్ ఏంజిల్స్ లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యాడు..ఆయనతో పాటుగా డైరెక్టర్ రాజమౌళి కూడా ఈ ఈవెంట్.లో పాల్గొన్నాడు..బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీ లో ‘నాటు నాటు’ పాట ఈ అవార్డ్స్ లో నామినేషన్ దక్కించుకుంది.
ఇది ఇలా ఉండగా టైటానిక్ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఫ్రాన్సెస్ ఫిషర్ రామ్ చరణ్ పై ట్విట్టర్ లో ప్రశంసల వర్షం కురిపించింది..టైటానిక్ సినిమాలో ఈమె కేట్ విన్సెట్ కి తల్లి పాత్రలో నటించింది..నిన్న ట్విట్టర్ లో ఆమె మాట్లాడుతూ ‘ఈమధ్యనే నేను #RRR సినిమా చూసాను..చాలా బాగా నచ్చింది..ఇందులో రామ్ చరణ్ నటన మరియు డ్యాన్స్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది’ అంటూ రామ్ చరణ్ ని ట్యాగ్ చేస్తూ మెచ్చుకుంది.

దీనికి చరణ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమె ట్వీట్ కి రీట్వీట్స్ కొట్టారు..ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..రామ్ చరణ్ కి రోజురోజు పాన్ వరల్డ్ స్టార్ గా పెరుగుతున్న ఆదరణ చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు..శంకర్ సినిమా తో రామ్ చరణ్ లెవెల్ మరో రేంజ్ కి వెళ్తుందని..ఇక రామ్ చరణ్ సినిమా అంటే టాలీవుడ్ హీరో సినిమా కాదని..పాన్ వరల్డ్ సినిమా అంటూ గర్వపడుతున్నారు ఫ్యాన్స్.