Sai Pallavi Shocking Reaction: కొన్నాళ్లుగా సాయి పల్లవి ప్రేమ, పెళ్లి రూమర్స్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వరుస విజయాలతో జోరుమీదున్న సాయి పల్లవి సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చారు. పెళ్లి ఆలోచనతోనే సాయి పల్లవి కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయడం లేదన్న వాదన బయలుదేరింది. తాజాగా సాయి పల్లవి ఓ తెలుగు హీరో ప్రేమలో ఉన్నట్లు కొత్త వాదన మొదలైంది. ఆ హీరోని పెళ్లాడాలని డిసైడ్ అయిన సాయి పల్లవి, పేరెంట్స్ చూసిన సంబంధాలు కూడా రిజెక్ట్ చేస్తున్నారట. లాక్ డౌన్ సమయంలో సాయి పల్లవి పెళ్లి తంతు ముగించాలని శతవిధాలా ప్రయత్నం చేశారట.

తెలుగు హీరోతో ప్రేమ, త్వరలో సాయి పల్లవి పెళ్లి అంటూ కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆమె ఓ క్లారిటీ ఇచ్చారు. విరాటపర్వం మూవీ విడుదల నేపథ్యంలో సాయి పల్లవి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో నేడు ఆమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకొని, స్టార్ గా ఎదిగిన మీరు, పెళ్లి కూడా తెలుగు అబ్బాయినే చేసుకుంటారా? అని మీడియా ప్రతినిధులు అడిగారు.
ఆ ప్రశ్నకు సాయి పల్లవి కొంచెం సెటైరికల్ సమాధానం చెప్పారు. నన్ను పెళ్లాడే తెలుగు అబ్బాయి ఇంకా పుట్టలేదేమో… అంటూ ఆ ప్రశ్న దాటవేశారు. సాయి పల్లవి సమాధానం అస్పష్టంగా ఉన్న నేపథ్యంలో ఈ రూమర్స్ పై క్లారిటీ రాలేదు. కాగా గతంలో సాయి పల్లవి అసలు పెళ్లి చేసుకోనని చెప్పడం కొసమెరుపు. నాకు పెళ్లి పట్ల ఆసక్తి లేదు. తల్లిదండ్రులతో జీవితాంతం గడిపేస్తా అంటూ చెప్పుకొచ్చారు. ఇక సాయి పల్లవి పెళ్లిపై వస్తున్న పుకార్లకు కాలమే సమాధానం చెప్పాలి.

సాయి పల్లవి గత చిత్రం శ్యామ్ సింగరాయ్ హిట్ టాక్ తెచ్చుకుంది. లేటెస్ట్ మూవీ విరాటపర్వం జూన్ 17న విడుదల కానుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరో రానా, సాయి పల్లవి ప్రేమికులైన నక్సల్స్ గా కనిపించనున్నారు. ప్రియమణి కీలక రోల్ చేస్తున్నారు. దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు.
Recommended Videos