Prabhas: ప్రభాస్ తో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్న తమిళ్ స్టార్ డైరెక్టర్…వర్కౌట్ అవుతుందా..?

టాప్ లో ఉన్న హీరోలతో సినిమాలు చేయడానికి దర్శకులందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే మిగితా హీరోలతో చేసేకంటే టాప్ హీరోలతో మూవీ చేస్తే వాళ్ల సినిమాలకి ఎక్కువ రీచ్ దొరుకుతుంది. దానివల్ల వాళ్ళకి కూడా మంచి పేరు వస్తుంది. అందుకే స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి దర్శకులు పోటీ పడతారు...

Written By: Gopi, Updated On : September 7, 2024 12:26 pm

Prabhas

Follow us on

Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నా నటుడు ప్రభాస్…ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో ఎవరికి అందనంత ఎత్తులో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ గా ఎదగడమే కాకుండా సినిమాలతో భారీ రికార్డులను కూడా నెలకొలుపుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ప్రభాస్ లాంటి నటుడు చేయబోయే సినిమాల మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క దర్శకుడు కూడా ప్రభాస్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో తమిళ్ దర్శకుడు అయిన గౌతమ్ మీనన్ కూడా ప్రభాస్ తో ఒక భారీ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక గౌతమ్ మీనన్ అనగానే మనకు లవ్ స్టోరీ, గ్యాంగ్ స్టర్ సినిమాలు గుర్తుకొస్తూ ఉంటాయి.

ఆయన డిఫరెంట్ జానర్స్ లో సినిమాలను చేస్తూ వైవిధ్యభరితమైన కథాంశాలతో సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటాడు. అందువల్లే ఆయనకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అయితే ఉంది. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయనకు చాలా మంచి పేరు అయితే ఉంది. ప్రభాస్ ని గ్యాంగ్ స్టర్ గా చూపించి భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రణాళికలను రూపొందిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ప్రభాస్ ఫుల్ లెంత్ గ్యాంగ్ స్టర్ రోల్ ని పోషించలేదు. కాబట్టి ఆయనకు ఈ క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉంటుందని పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ప్రభాస్ మాత్రం గౌతమ్ మీనన్ కి డేట్స్ ఇచ్చే అవకాశాలైతే లేవు. ఎందుకంటే ఇప్పటికే ఆయన నాలుగు సినిమాలకు కమిట్ అయి ఉన్నాడు. ఈ నాలుగు సినిమాలు పూర్తి అయిన తర్వాత గౌతమ్ మీనన్ తో సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన కొన్ని సినిమాల్లో నటిస్తు నటుడిగా కూడా చాలా బిజీగా కొనసాగుతున్నాడు. మరి ప్రభాస్ ఫ్రీ అయ్యేంతవరకు గౌతమ్ మీనన్ వెయిట్ చేస్తాడా? లేదంటే వేరే హీరోతో ఆ సినిమాని చేసేస్తాడా?

అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఇండియాలో ఉన్న ప్రతి దర్శకుడు ప్రభాస్ తో సినిమా చేయడమే లక్ష్యం గా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రభాస్ మాత్రం తెలుగు సినిమా దర్శకులకు ముందుగా అవకాశాలను ఇస్తున్నాడు. ఆ తర్వాత మిగిలిన భాష దర్శకులకు అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నాడు…