Chiranjeevi And Krishna Vamsi: తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద చెరగని ముద్ర వేసిన హీరో మెగాస్టార్ చిరంజీవి ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప విజయాలను అందించాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నాడు. 70 సంవత్సరాల వయసులో సైతం ఆయన కమర్షియల్ సినిమాలను చేస్తూ డాన్సులు వేస్తూ, ఫైట్లు చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఆయన ‘మన శంకర్ వరప్రసాద్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది…ఇక ఇదిలా ఉంటే చిరంజీవి ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లందరితో సినిమాలను చేశాడు. ఒక్క కృష్ణవంశీ తో మాత్రం ఆయన సినిమా చేయలేకపోయాడు. కారణం ఏంటి అంటే కృష్ణవంశీ ‘వందేమాతరం’ అనే సినిమాని చిరంజీవితో తెరకెక్కించాలనే ప్రయత్నం చేశాడు కానీ అది అనుకోని కారణాలవల్ల కార్యరూపం దాల్చలేదు. వీళ్లిద్దరి కాంబినేషన్లో థమ్సప్ యాడ్ వచ్చింది.
కానీ సినిమా వస్తే బాగుండేది అని అప్పట్లో చిరంజీవి అభిమానులు చాలావరకు వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేశారు. ఇక వందేమాతరం అనే సినిమా ఆగిపోవడానికి ముఖ్య కారణం అల్లు అరవింద్ అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. దేశభక్తికి సంబంధించిన కథ కావడంతో చిరంజీవి అప్పటికే కమర్షియల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
కాబట్టి అలాంటి సమయం లో ఆ కథ తో సినిమా చేయడం వల్ల చిరంజీవి కెరీర్ కి ఏమైనా ఇబ్బంది ఎదురవ్వచ్చనే ఉద్దేశ్యంతోనే ఆ సినిమా ను చేయొద్దని చెప్పాడట. నిజానికి ఆ సినిమా అయితే సక్సెస్ అవుతుంది, లేకపోతే డిజాస్టర్ అవుతుందనే రిజల్ట్ ఏది వచ్చిన నీకు ప్లస్ అవ్వదు అని చిరంజీవికి చెప్పారట.
దాంతో చిరంజీవి సైతం అల్లుఅరవింద్ మాటలను విని ఆ సినిమాని పక్కనపెట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే కృష్ణవంశీ ఆ తర్వాత ఖడ్గం లాంటి ఒక దేశభక్తికి సంబంధించిన సినిమాను తెరకెక్కించి సూపర్ సక్సెస్ గా నిలపడమనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…