Venkatesh Son Arjun: ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించడంలో సూపర్ సక్సెస్ అయిన నటుడు విక్టరీ వెంకటేష్…ఒకప్పుడు శోభన్ బాబు సినిమాలు చూడడానికి ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా థియేటర్ కి వచ్చేవారు. కానీ ఆ తర్వాత కాలంలో ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించలేకపోయారు. ఇక వెంకటేశ్ ఎప్పుడైతే ఫ్యామిలీ సినిమాలను చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడో అప్పటినుంచి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ సినిమా థియేటర్ కి రావడం స్టార్ట్ చేశారు. వెంకటేష్ సినిమాలను చూసి ఏడ్చుకుంటూ బయటికి వెళ్లిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి సెంటిమెంటల్ సినిమాలను చేసే వెంకటేష్ మాస్, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కూడా సినిమాలను చేసి తనదైన మార్కును చూపించాడు. ఇక ఇప్పటికే వరుస సినిమాలను చేస్తున్న ఆయన ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక తన విషయం పక్కన పెడితే ఇప్పుడున్న స్టార్ హీరోలందరు వాళ్ళ వారసులను హీరోలుగా పరిచయం చేస్తున్నారు. వెంకటేష్ కొడుకు అయిన అర్జున్ ను సైతం తొందర్లోనే హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నాడంటూ వార్తలైతే వస్తున్నాయి.
ఇప్పటికే తనకి యాక్టింగ్ కి సంబంధించిన విషయాలు. తెలుసుకోవడానికి ఫారన్ లో శిక్షణను ఇప్పిస్తున్నారు. ఇక ఇలాంటి వెంకటేష్ తన వారసుడిని ఎప్పుడు ఇండస్ట్రీకి తీసుకొస్తున్నాడు అనేదానిమీద తీవ్రమైన చర్చలైతే నడుస్తున్నాయి…ఇక రెండు మూడు సంవత్సరాల్లో వెంకటేష్ కొడుకు అర్జున్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నాడు.
ఇక ఈ సినిమాకి త్రివిక్రమ్ కొడుకు దర్శకుడిగా వ్యవహరించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. గతంలో త్రివిక్రమ్ కొడుకు అకిరా నందన్ ను డైరెక్షన్ చేస్తాడనే వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు వెంకటేష్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. అందుకే వెంకటేష్ కొడుకుని పరిచయం చేసే బాధ్యతను త్రివిక్రమ్ తీసుకొని తన కొడుకు చేత డైరెక్షన్ చేయించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…
ఇది కార్య రూపం దాల్చుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందని వెంకటేష్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమాతో మరోసారి వెంకటేష్ హైవోల్టేజ్ సక్సెస్ ని అందించబోతున్నాడు అంటూ అతని అభిమానులు ఆనందపడుతున్నారు…