https://oktelugu.com/

Nandamuri Mokshajna : అర్జునుడు..కృష్ణుడు..అభిమన్యుడు..నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమా స్టోరీ లైన్ వింటే మెంటలెక్కిపోతారు!

స్టైలిష్ గా ఉన్నాడు. లవ్ స్టోరీ తీస్తున్నారేమో అని అనుకుంటే పొరపాటే. ఇది కూడా కల్కి తరహా చిత్రమని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. కల్కి చిత్రం లో ప్రభాస్ కర్ణుడిగా చివర్లో రివీల్ అవుతాడు. ఈ సినిమా కూడా మహాభారతం ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిస్తున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

Written By:
  • Vicky
  • , Updated On : October 15, 2024 / 10:05 PM IST

    Nandamuri Mokshajna

    Follow us on

    Nandamuri Mokshajna : నందమూరి బాలకృష్ణ కుమారుడు, నందమూరి మోక్షజ్ఞ తేజ వెండితెర అరంగేట్రం కోసం అభిమానులు చాలా కాలం నుండి ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అనేక కారణాల చేత ఆయన వెండితెర అరంగేట్రం వాయిదా పడుతూ ఎట్టకేలకు ఇటీవలే పట్టాలెక్కింది. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని మోక్షజ్ఞ పుట్టినరోజు నాడు విడుదల చేసారు మేకర్స్. చూసేందుకు చాలా స్టైలిష్ గా ఉన్నాడు. లవ్ స్టోరీ తీస్తున్నారేమో అని అనుకుంటే పొరపాటే. ఇది కూడా కల్కి తరహా చిత్రమని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. కల్కి చిత్రం లో ప్రభాస్ కర్ణుడిగా చివర్లో రివీల్ అవుతాడు. ఈ సినిమా కూడా మహాభారతం ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిస్తున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

    ఇందులో బాలకృష్ణ అర్జునుడిగా ఫుల్ లెంగ్త్ క్యారక్టర్ ని చేస్తున్నాడట. అదే విధంగా మోక్షజ్ఞ అభిమన్యుడి క్యారక్టర్ ని చేస్తుండగా, శ్రీకృష్ణుడు క్యారక్టర్ ని సీనియర్ ఎన్టీఆర్ చేస్తున్నాడట. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సినిమాలో టెక్నాలజీ ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చనిపోయిన వారిని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తో ముఖాన్ని ఆధారంగా తీసుకొని నటింపచేయవచ్చు. అమెరికా లో ఈ టెక్నాలజీ ని సినిమాల్లో వాడుతున్నారు. ఇప్పుడిప్పుడే ఇండియా లో కూడా ఈ టెక్నాలజీ ని తీసుకొస్తున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వృద్ధిలోకి రాకముందే డైరెక్టర్ రాజమౌళి యమదొంగ చిత్రం లో ఇలాంటి ప్రయత్నం చేసి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసాడు. కేవలం 20 కోట్ల రూపాయిల బడ్జెట్ తో హనుమాన్ చిత్రం ద్వారా 400 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేసినట్టుగా చూపించిన ప్రశాంత్ వర్మ, ఇంత స్కోప్ ఉన్న సినిమా తో, భారీ బడ్జెట్ ని ఉపయోగించి ఏ స్థాయిలో తెరకెక్కిస్తాడో ఊహించుకోవచ్చు. మూడు తరాల నందమూరి హీరోలు ఒకే తెరపై కనిపిస్తే అభిమానులు ఆగగలరా..?, జనరంజకంగా ఆ సినిమాని తెరకెక్కిస్తే పాన్ ఇండియా లెవెల్ లో అద్భుతాలు సృష్టించవచ్చు.

    ‘హనుమాన్’ చిత్రం తో ఏకంగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన ప్రశాంత్ వర్మ, ఇప్పుడు నందమూరి నటవారసుడితో ఎలాంటి బాక్స్ ఆఫీస్ వండర్స్ ని క్రియేట్ చేయబోతున్నాడో చూడాలి. ఈ చిత్రంతోనే మోక్షజ్ఞ స్టార్ హీరోల లీగ్ లోకి కూడా అడుగుపెట్టొచ్చు. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ని ప్రారంభించి, 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఇందులో హీరోయిన్ గా మొదట శ్రీలీల ని తీసుకోవాలని అనుకున్నారు కానీ, ఇప్పుడు రీసెంట్ గా జాన్వీ కపూర్ పేరు వినిపిస్తుంది. ‘దేవర’ చిత్రం హిట్ అవ్వడం తో ఈ హాట్ బ్యూటీ క్రేజ్ టాలీవుడ్ లో అమాంతం పెరిగిపోయింది. అందుకే మేకర్స్ ఆమె డేట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.