Nani-Shraddha Kapoor : ఈ ఏడాది పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోలను సైతం అవలీలగా డామినేట్ చేసి సంచలనం సృష్టించిన హీరోయిన్ శ్రద్దా కపూర్. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘స్త్రీ 2’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 900 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఇతర ప్రాంతీయ భాషల్లో విడుదల కాకుండా, కేవలం హిందీ వెర్షన్ నుండి ఈ స్థాయి వసూళ్లు రావడం ఇదే తొలిసారి. #RRR , జవాన్, కల్కి, పఠాన్, బాహుబలి 2 , కేజీఎఫ్ చాప్టర్ 2 ఇలా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రాలన్నీ పాన్ ఇండియన్ చిత్రాలే. ఇతర భాషల్లో వచ్చిన వసూళ్లతో పాటు, హిందీ వెర్షన్ వసూళ్లు కూడా కలవడంతో అవి వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకున్నాయి. కానీ స్త్రీ 2 కేవలం హిందీ వెర్షన్ నుండి ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం నిజంగా అద్భుతం అనే చెప్పాలి.
బాలీవుడ్ ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం, కేవలం హిందీ వెర్షన్ వరకు చూస్తే స్త్రీ 2 చిత్రం ఆల్ టైం రికార్డు గ్రాసర్ అని అంటున్నారు. స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానటువంటి అరుదైన రికార్డుని శ్రద్దా కపూర్ స్త్రీ2 తో నెలకొల్పింది. అందుకే ఆమెకు పాన్ ఇండియన్ లెవెల్ లో ఇంతటి క్రేజ్ ఏర్పడింది. మొదటి నుండే శ్రద్ద కపూర్ కి బాలీవుడ్ లో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, ఈ చిత్రం తో ఆ ఇమేజ్ పదింతలు పెరిగింది. ఇంస్టాగ్రామ్ లో ఈమెకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని మించిన ఫాలోవర్లు కూడా ఉన్నారు. అలాంటి హీరోయిన్ తో నాని తన తదుపరి చిత్రం లో ఎంచుకున్నట్టు లేటెస్ట్ గా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్. తనకి దసరా వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన శ్రీకాంత్ ఓడేలా తో ఆయన రీసెంట్ గానే ఒక సినిమా ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరో పాత్ర తో పాటుగా, హీరోయిన్ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్. ఆ పాత్ర పోషించాలంటే కచ్చితంగా నటనలో నిష్ణాతులు అయ్యుండాలి.
అందుకే శ్రద్దా కపూర్ ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. పైగా చేస్తున్నది పాన్ ఇండియన్ సినిమా కావడంతో, కచ్చితంగా శ్రద్దా కపూర్ కి ఉన్న ఫేమ్ ఈ చిత్రానికి బాలీవుడ్ లో బాగా కలిసి వస్తుందని, ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోసింగ్ వరకు సినిమాకి టాక్ వస్తే వసూళ్లు అదిరిపోతాయని అంచనా వేసి ఆమెని ఈ చిత్రం కోసం తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె ఒప్పుకుంటే మాత్రం నాని దశ తిరిగినట్టే అని చెప్పొచ్చు. కానీ రెమ్యూనరేషన్ విషయం లో ఈమె నిర్మాతలకు చుక్కలు చూపించే ప్రమాదం ఉంది. నాని కంటే ఎక్కువ డిమాండ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నాని ఒక్కో సినిమాకి 20 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు, మరి శ్రద్దా ఎంత డిమాండ్ చేస్తుందో చూడాలి.