Star Heroine: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వాళ్లు కొన్నాళ్ల పాటు తమ హవా సాగిస్తారు. అందం, అభినయంతో పిచ్చెక్కించి దర్శక, నిర్మాతలతో పాటు హీరోలను తమ చుట్టూ తిప్పుకుంటారు. టాలీవుడ్ కు చెందిన ఓ బ్యూటీ కొన్నాళ్ల పాటు వరుస సినిమాల్లో నటించింది. ఆమె అందానికి ఫిదా అయిన స్టార్ హీరోలు ఎన్టీఆర్, చెర్రీ, బన్నీ లాంటివాళ్లు ఆమెతో నటించేందుకు ఇంట్రెస్టు పెట్టారు. అయితే ప్రస్తుతం పూజా హెగ్డే లాంటి వాళ్లు సందడి చేయడంతో ఆ భామకు అవకాశాలు తగ్గాయి. ఇదిలా ఉండగా సినిమాల్లో హవా సాగుతున్ననాళ్లు ఓ పొలిటికల్ లీడర్ అండదండలతో ఈ హాట్ బ్యూటీ పలు వ్యాపారాలను స్ట్రాట్ చేసిందట. కొన్నాళ్లు ఆ లీడర్ ను వాడుకొని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుందట. ఆ తరువాత అతడిని వదిలి ఇప్పుడు మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెబుతోంది. అందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట్లో పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.

బక్కపల్చని శరీరాకృతి ఉన్న ఆ హీరోయిన్ దాదాపు టాలీవుడ్ ఫేమస్ హీరోలందరి పక్కన నటించింది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ స్టార్ హీరోలతో కలిసి రొమాన్స్ చేసింది. కొన్నాళ్లపాటు ఆమె లేకపోతే సినిమానే లేదనే స్టేజికి ఎదిగిందీ భామ. అయితే ఫామ్ లో ఉండగా ఈ అమ్మడు గట్టిగానే వెనుకేసుకుందట. అంతేకాకుండా తన తమ్ముడిని హైదరాబాద్ కు రప్పించి అనేక వ్యాపారాలను మొదలు పెట్టించిందట. నగరంలో మూడు సెంటర్లలో బిజినెస్ చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతుందట. హైదరాబాద్లోనే కాకుండా బెంగుళూరు, చెన్నైలోనూ ఈ భామకు కొన్ని వ్యాపారలున్నట్లు సమాచారం.
అయితే ఆమె వ్యాపారంలో రాణించడానికి ఓ పొలిటికల్ లీడర్ అండదండలు బాగా ఉన్నాయట. వీరిద్దరి మధ్య మామూలు సంబంధం కాకుండా చాలా వరకు వెళ్లిందట. అయితే దీనిపై రాజకీయాల్లో తీవ్ర చర్చ జరిగినా ఆ హీరోయిన్ మాత్రం అస్సలు జంకకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది.ఎవరేమి అనుకున్నా తన వ్యాపారాలను విస్తరించడానికి ఆ లీడర్ ను బాగా వాడుకుందని సమాచారం. మూడేళ్లపాటు వీరు చాలా క్లోజ్ గా ఉన్నారు. కానీ ఆ తరువాత అతనికి దూరమైంది.

ఇప్పుడు ఓ వ్యక్తిని ప్రేమించి అతనితో పెళ్లికి సిద్ధమైంది. తనను పెళ్లి చేసుకుంటున్నాననంటూ తనకు కాబోయే భర్త ఫొటోలు పెట్టి హల్ చల్ చేస్తోంది. అయితే తన వ్యాపార అవసరాలకు పొలిటికల్ లీడర్ ను వాడుకొని ఇప్పుడు మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంపై ఆ బ్యూటీపై రకరకాల విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదీ ఏమైనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలే అన్న సామెతను బాగా వాడుకున్న ఈమె అటు ఆర్థికంగా సెటిలై.. ఇప్పుడు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకుంటోంది.