https://oktelugu.com/

Rajendra Prasad : రాజేంద్ర ప్రసాద్ కారణంగా నా కెరీర్ సర్వ నాశనం అయ్యింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కామెడీ జానర్ సినిమాల హీరో గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థాయిని సంపాదించుకున్న హీరో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్.

Written By:
  • Vicky
  • , Updated On : January 1, 2025 / 01:37 PM IST

    Rajendra Prasad

    Follow us on

    Rajendra Prasad : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కామెడీ జానర్ సినిమాల హీరో గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థాయిని సంపాదించుకున్న హీరో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్. అప్పట్లో ఈయన సినిమాలు మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో వసూళ్ల పరంగా పోటీ పడేవి.అలా ఆయన రెగ్యులర్ హీరో పాత్రలకు బిన్నంగా, ఒక కొత్త జానర్ ని క్రియేట్ చేసి, ఆ జానర్ తో ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నాడు. ఇప్పటికీ ఆయన పాత సినిమాలు టీవీ లో వస్తే ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు, మంచి రేటింగ్స్ వస్తుంటాయి. తెలుగు ప్రేక్షకులకు అలాంటి క్లాసిక్స్ ని అందించాడు ఆయన. అయితే ఇప్పుడు వయస్సు మీద పడడంతో క్యారక్టర్ రోల్స్ చేస్తూ ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. యంగ్ హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు రాజేంద్ర ప్రసాద్ ని తమ సినిమాలో ఎదో ఒక ముఖ్యమైన పాత్రలో తీసుకునేందుకు అమితాసక్తిని చూపిస్తున్నారు.

    ఇదంతా పక్కన పెడితే అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలలో ఒకటి బాపు దర్శకత్వం లో వచ్చిన ‘పెళ్లి పుస్తకం’. ఇందులో రాజేంద్ర ప్రసాద్ కి జోడిగా దివ్యవాణి నటించింది. అయితే రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూ లో రాజేంద్ర ప్రసాద్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. ఆయన వల్లే తన కెరీర్ అక్కడితో ఆగిపోయింది అంటూ ఎమోషనల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ ‘పెళ్లి పుస్తకం చిత్రం తర్వాత నాకు మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ తో ‘మిస్టర్ పెళ్ళాం’ చిత్రం లో హీరోయిన్ నటించే అవకాశం దక్కింది. కానీ రాజేంద్ర ప్రసాద్ కి నేను ఎందుకు నచ్చలేదో నాకు తెలియదు కానీ, ఆయన నా సినిమాలో దివ్యవాణి హీరోయిన్ గా నటించడానికి వీలు లేదు అని గట్టిగా చెప్పాడట. దాంతో బాపు గారు ఆమని ని హీరోయిన్ గా తీసుకున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది.

    ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఆ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నేను ఆ సినిమాలో నటించి ఉండుంటే కచ్చితంగా నాకు కెరీర్ పరంగా మంచి బూస్ట్ ఉండేది. రాజేంద్ర ప్రసాద్ కారణంగానే నా కెరీర్ ఇలా తయారైంది. కానీ ఆమని కి ఆ చిత్రం ద్వారా చాలా మంచి గుర్తింపు లభించింది. దానికి నాకు ఎంతో సంతోషం కలిగింది’ అంటూ దివ్య వాణి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దివ్య వాణి లీగ్ లో ఉన్న హీరోయిన్లు ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీ లో రాణిస్తున్నారు. కానీ దివ్య వాణి కి మాత్రం అవకాశం రావడం లేదు. కెరీర్ మొత్తం మీద ఈమె కేవలం 24 సినిమాలు మాత్రమే చేసింది. దీనిని బట్టి చూస్తే పెళ్లి పుస్తకం సినిమా ఆఫర్ పోవడం ఈమె కెరీర్ కి ఎంత ఎఫెక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు.