Mahesh Babu and Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇప్పటివరకు వాళ్ళు చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెడుతున్నాయి. ఇక రాజమౌళి లాంటి దర్శకుడు సైతం పాన్ ఇండియాలో భారీ సినిమాలను చేసి ఇప్పుడు పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు. మరి రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న పాన్ వరల్డ్ సినిమాలో భారీ స్టార్స్ ని తీసుకోబోతున్నారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు బ్రదర్ క్యారెక్టర్ లో విక్టరీ వెంకటేష్ ని తీసుకోబోతున్నారననే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి అనే విషయాలు తెలీదు. కానీ ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
వెంకటేష్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే వీళ్ళిద్దరి మధ్య బ్రదర్స్ అనే ఒక బాండింగ్ అయితే చాలా బాగా క్రియేట్ అయింది. కాబట్టి జనాల్లో కూడా వీళ్ళిద్దరూ అన్నదమ్ములు అంటే ఈజీగా నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఆ బాండింగ్ రీ క్రియేట్ చేయడానికి రాజమౌళి ఈ సినిమాలో బ్రదర్ క్యారెక్టర్ కోసం వెంకటేష్ ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇక మొదట ఇతర భాషల హీరోలను అనుకున్నప్పటికి వాళ్ళు ఎవరూ కూడా ఆ క్యారెక్టర్ కి సెట్ అవ్వరనే ఉద్దేశ్యంతో ఆయన ఈ సినిమా కోసం విక్టరీ వెంకటేష్ ని తీసుకోవాలనే ప్రణాళికలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి వీళ్ళ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా రీసెంట్ గా పూజ కార్యక్రమాలనైతే జరుపుకుంది. మరి రెగ్యూలర్ షూట్ కి కూడా వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక వచ్చే నెల నుంచి మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమాతో రాజమౌళి ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా సినిమా ఎలాంటి హైప్ క్రియేట్ చేసుకుంటుందనేది… ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ వరల్డ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంటుంది అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…