Sudigaali Sudheer: సినిమాల్లో హీరో రాణించేందుకు అన్ని విధాలుగా అర్హతులు ఉన్న అతి తక్కువ మంది బుల్లితెర స్టార్స్ లో ఒకరు సుడిగాలి సుధీర్(Sudigaali Sudheer). ఈటీవీ లో గత 12 ఏళ్ళ నుండి ప్రసారం అవుతున్న ‘జబర్దస్త్’ అనే కామెడీ షో నుండి వచ్చిన టాలెంటెడ్ కమెడియన్ ఇతను. ఒకానొక దశలో ఈటీవీ లో సుడిగాలి సుధీర్ లేనిదే ఎంటర్టైన్మెంట్ షో నడిచేది కాదు, అలాంటి సుధీర్ కి సినిమాల్లో అవకాశాలు రావడంతో బుల్లితెర కి దూరం అయ్యాడు. ఈమధ్య ఈటీవీ లో ప్రతీ ఆదివారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే ‘ఫ్యామిలీ స్టార్స్’ అనే ప్రోగ్రాం కి ఒక్కటే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు, ఆ తర్వాత ఆహా మీడియా లో ‘సర్కార్ 5’ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ రెండు తప్ప సుధీర్ చేతిలో మరో షో లేదు, సినిమాలు కూడా లేవు.
Also Read: ‘కాంతారా 3’ లో జూనియర్ ఎన్టీఆర్..ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడంటే!
రెండేళ్ల క్రితం ‘గోట్’ అనే చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఈ సినిమా నుండి విడుదలైన ఒక పాటకు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అబ్బా..పర్లేదులే, సుధీర్ సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది, ఇక వేరే లెవెల్ కి వెళ్ళిపోతాడని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా పరిస్థితి ఏమైందో ఎవరికీ తెలియదు. మధ్యలోనే అర్థాంతరంగా ఆగిపోయింది. సుధీర్ హీరో గా నటించిన సినిమాలన్నిటికీ మినిమం గ్యారంటీ ఓపెనింగ్స్ వచ్చాయి. ‘గాలోడు’ చిత్రం అయితే కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తమిళనాడు లో శివకార్తికేయన్ ఎలా అయితే ఎదిగాడో, సుధీర్ కూడా అలా ఎదుగుతాడని అంతా అనుకున్నారు. కానీ ఆయన కెరీర్ ని ముందుకు వెళ్లనివ్వకుండా చాలా శక్తులు అడ్డం పడుతున్నాయి. దీని వెనుక ఒక సీనియర్ హీరో హస్తం కూడా ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. గాలోడు అనే చిత్రం కమర్షియల్ గా సక్సెస్ అవ్వడం చూసి, సుధీర్ భవిష్యత్తులో మంచి సినిమా తీస్తే పెద్ద హిట్ కొడుతాడు , మన కొడుకు కెరీర్ రిస్క్ లో పడుతుంది,ఇలాంటి వాళ్ళను ప్రారంభం లోనే తొక్కేయాలి అనే ఉద్దేశ్యంతో కావాలని సినిమా అవకాశాలు రానివ్వకుండా చేస్తున్నారని అంటున్నారు.
సుధీర్ అద్భుతంగా కామెడీ చేయగలడు, సెంటిమెంట్ ని పండించగలడు, ముఖం లో అన్ని రకాల ఎక్స్ ప్రెషన్స్ పలుకుతాయి, అంతే కాకుండా డ్యాన్స్ విషయం లో ఎంతో మంది యంగ్ హీరోలు కూడా సుధీర్ కి దరిదాపుల్లో రాలేరు, అలాంటి టాలెంట్ ఉన్న నటుడ్ని నిజంగా తొక్కేయడానికి ప్రయత్నాలు జరుగుతుంటే మాత్రం మహా పాపం అని అనుకోవాలి. టాలెంట్ ని టాలెంట్ తోనే కొట్టే ప్రయత్నం చేయాలి కానీ, ఇలాంటి టాలెంట్ ఉన్న కుర్రాళ్లను తొక్కడం ఏ మాత్రం సబబు కాదు. సుధీర్ కి ఇప్పుడంటే వయస్సు ఉంది, ఇంకో మూడేళ్లు దాటితే హీరో అవకాశాలు రావడం అసాధ్యం. సుధీర్ ఈ సవాళ్ళను ఎదురుకొని ఎలా నిలబడుతాడో చూడాలి.