Bigg Boss 9 Telugu Common People: ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ టీం ఈసారి సామాన్యులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. వరుసగా 8 సీజన్స్ నుండి ఆదరిస్తున్న ఆడియన్స్ ని బిగ్ బాస్ షో లో పాల్గొనేలా చేస్తే ఎలా ఉంటుంది అనే గొప్ప ఆలోచనతో గత నెలలో ఒక 40 మంది సామాన్యులను ఎంపిక చేశారు. వీరికి ‘అగ్ని పరీక్ష’ అనే పోటీ పెట్టి, అందులో గెలిచినా 8 మందిని ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) లోకి కంటెస్టెంట్స్ గా పంపబోతున్నారు. త్వరలోనే ఈ ‘అగ్నిపరీక్ష’ షో జియో హాట్ స్టార్ లో ప్రసారం కాబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమో ని కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించబోతుంది. సన్నీ, కౌశల్, నవదీప్ మరియు శివాజీ వంటి వారు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించబోతున్నారు. ఈ షో కి కూడా బిగ్ బాస్ లాగానే ఆడియన్స్ ఓటింగ్ ఉంటుందట.
Also Read:‘కాంతారా 3’ లో జూనియర్ ఎన్టీఆర్..ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడంటే!
కేవలం ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎంపిక కాబడిన సామాన్యులు మాత్రమే బిగ్ బాస్ 9 హౌస్ లోకి పంపబోతున్నారు. ఇది సామాన్యుల పాలిట వరం లాంటిది అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇంతకు ముందు సీజన్స్ లో కూడా సామాన్యులు వచ్చారు. ఉదాహరణకు బిగ్ బాస్ సీజన్ 2 లో సంజన మరియు గణేష్ అని ఇద్దరు సామాన్యులు వచ్చారు గుర్తుందా ?, అందులో గణేష్ అనే వ్యక్తి ఎలాగో అలా నెట్టుకొచ్చాడు కానీ, సంజన అనే అమ్మాయి మాత్రం కేవలం మొదటి వారం లోనే వెళ్లిపోవాల్సి వచ్చింది. కారణం సామాన్యురాలు అవ్వడం వల్ల , ఆమె గురించి జనాలెవ్వరికీ ఏమి తెలియకపోవడం వల్ల , ఫ్యాన్ బేస్ లేకపోవడం వల్ల ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. కానీ ఈసారి హౌస్ లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్ కి ఈ అగ్నిపరీక్ష షో ద్వారా కచ్చితంగా ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది.
ఎంతలా అంటే వీళ్ళు హౌస్ లోపల ఉన్నటువంటి సెలబ్రిటీలను కూడా డామినేట్ చేయగలరు. అలాంటి ఫ్యాన్ బేస్ రావొచ్చు అన్నమాట. ఇలాంటి అదృష్టం సామాన్యులకు తదుపరి సీజన్స్ లో దక్కుతుందో లేదో తెలియదు కానీ, ఈ సీజన్ లో మాత్రం దున్నేయొచ్చు. కాబట్టి అగ్నిపరీక్ష కి ఎంపికైన సామాన్యులు ప్రాణం పెట్టి గేమ్స్ ఆది హౌస్ లోకి ఎంపిక అయ్యేందుకు ప్రయత్నం చేయండి. ఒక్కసారి లోపలకు వెళ్లిన తర్వాత మీ టాలెంట్ ని చూసి సినిమా అవకాశాలు కూడా క్యూలు కట్టొచ్చు. సెలక్షన్ ప్రక్రియ కూడా బిగ్ బాస్ టీం చాలా నిజాయితీగా చేస్తుందట. బ్యాక్ గ్రౌండ్ మొత్తం చూసి, అతను కచ్చితంగా సామాన్యుడు అని క్లారిటీ వచ్చిన తర్వాతనే తదుపరి ప్రక్రియకు వెళ్తున్నారట. ఇది నిజంగా శుభపరిణామమే. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని ట్విస్ట్స్ ఈ సీజన్ లో చూడబోతున్నాము అనేది.