Mangalavaaram: ఈమధ్య కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు వచ్చి మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక ఇలాంటి క్రమంలో రీసెంట్ గా వచ్చిన పులిమెర సినిమా మంచి కాన్సెప్ట్ తో వచ్చి మంచి విజయాన్ని అందుకోగా, ఇక మూడు రోజుల క్రితం రిలీజ్ అయిన మంగళవారం సినిమా కూడా మంచి కాన్సెప్ట్ తో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి అజయ్ భూపతి డైరెక్టర్ కావడం విశేషం…
ఇక అజయ్ భూపతి తన మొదటి సినిమాగా ఆర్ఎక్స్ 100 సినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇక ఆ తర్వాత శర్వానంద్ ని హీరోగా పెట్టి మహాసముద్రం అనే సినిమా చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఇక దాంతో ఒక రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ మళ్ళీ పాయల్ రాజ్ పుత్ ని మెయిల్ లీడ్ లో పెట్టి తీసిన సినిమానే మంగళవారం… ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో మొదటి నుంచి కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
ఇంకా దానికి తగ్గట్టుగానే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా సినిమా ప్రతి ప్రేక్షకుడికి బాగా నచ్చింది. ఇక ఈ సినిమాలో లేడీస్ కి సంభందించిన ఒక సెన్సిటివ్ మేటర్ ని తీసుకుని ఆయన చాలా చక్కగా డీల్ చేసి చూపించారు. ఇక సినిమా మొత్తం అధ్యంతం సస్పెన్స్ ని కలిగిస్తూ అక్కడక్కడ హర్రర్ ఎలిమెంట్స్ కూడా మిక్స్ అయి ఉన్నాయి.అలాగే చివర లో అయితే ట్విస్ట్ లా పరంపర కొనసాగుతుందనే చెప్పాలి ప్రతి 5 నిమిషాలకు ఒక ట్విస్ట్ రీవిల్ అవుతూ ఉంటుంది.ఇక ఇప్పటికే ఈ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ తో ముందుకు వెళ్తుంది…
అయితే ఈ సినిమాలో చివరిలో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది దాని కోసం డైరెక్టర్ ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోగా చేసిన కార్తికేయని తీసుకోవాలని అనుకున్నప్పటికీ కార్తికేయ కొన్ని కారణాలవల్ల ఆ సినిమా చేయలేకపోయాడు. ఇక దాంతో బలగం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ప్రియదర్శి ని ఆ క్యారెక్టర్ కోసం తీసుకొని అజయ్ భూపతి ప్రియదర్శి చేత ఆ క్యారెక్టర్ చేయించాడు.ఇక నిజానికి ప్రియదర్శి ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ప్రియదర్శి తన ఖాతాలో మరో హిట్ ను వేసుకున్నాడు. ప్రస్తుతం ప్రియదర్శి వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు.
ఇక ఈ సినిమా రిలీజ్ అయి సక్సెస్ అవ్వడంతో ఆ క్యారెక్టర్ నేను చేసి ఉంటే బాగుండేది అని కార్తికేయ బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది.ఈ క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ లా ఉన్నప్పటికీ సినిమా మొత్తంలో ఈ క్యారెక్టర్ ఇంపాక్ట్ అనేది చాలా హెవీగా ఉంటుంది…ఇలా కార్తికేయ ఒక మంచి క్యారెక్టర్ మిస్ చేసుకోవాల్సి వచ్చింది…